Jobs: ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సైంటిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 75,000 రూపాయల నుంచి 1,92,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్/పీహెచ్డీ పాస్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 118 రూపాయలు కాగా జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. 2022 సంవత్సరం మార్చి 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉండనుంది. https://thsti.res.in/newthsti/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.