ICG Navik GD Recruitment 2024
Indian Coast Guard recruitment 2024: ఇండియన్ కోస్టుగార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. జనరల్ డ్యూటీ(జీడీ) 50 ఖాళీలు, టెక్(ఇంజినీరింగ్/ఎలెక్ట్) 20 ఖాలీలు ఉన్నాయి. జనరల్ డ్యూటీ(జీడీ) పోస్టులకు దరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి.
– టెక్నికల్ (మెకానికల్) పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేవల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ లేదా డిజైన్ లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి.
– టెక్నికల్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)కు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలి కమ్యూనికేషన్ లేదా ఇన్సుట్రుమెంటర్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ పాస్ అయి ఉండాలి.
వయోపరిమితి ఇలా..
కోస్టుగార్డు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2024, జూలై 1 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు
కోస్టుగార్డు ఉద్యోగాలకు ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ,ఎస్సీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్ లేదా వీసా/మాస్టర్/మాస్ట్రో/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డు/యూపీఐ ఉపయోగించి ఆన్లైన్లో చెల్లించాలి.