పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం.. ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. దాంతోపాటు వ్యాధినిరోధక శక్తి తగ్గేందుకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
Also Read: ఉపవాసం ఉండడం మంచికా.. చెడుకా..?
మరుసటి రోజుకి సరిపడా.. శారీరక, మానసిక శక్తి సమకూరాలంటే కంటి నిండా నిద్రపోవాలి. కాబట్టి పదిగంటలలోపు నిద్రించే అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రాత్రిపూట చిరుతిళ్లు తినడం మంచిది కాదు. తద్వారా డయాబెటిస్ లాంటి వ్యాధులు తప్పవు. దానివల్ల డయాబెటిస్లాంటి రోగాలు వస్తాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్: పెరుగుతున్న లైంగిక సమస్యలు