spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kamal Haasan: శంకర్ మాదిరిగానే మణిరత్నం కూడా కమల్ హసన్ కు షాక్ ఇవ్వబోతున్నాడా..?

Kamal Haasan: శంకర్ మాదిరిగానే మణిరత్నం కూడా కమల్ హసన్ కు షాక్ ఇవ్వబోతున్నాడా..?

Kamal Haasan: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్లు ఎలాంటి పాత్రను పోషించిన కూడా అందులో పరకాయ ప్రవేశం చేసి నటించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటారు. ఇక అలాంటి వారిలో కమల్ హాసన్ ఒకరు. ఈయన నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరో అయినప్పటికీ దేశం మొత్తం మీద ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన ‘భారతీయుడు 2’ సినిమా నెగిటివ్ టాక్ ను సంపాదించుకొని ఫ్లాప్ దిశగా వెళుతుంది.

Also Read: శంకర్ మాదిరిగానే మణిరత్నం కూడా కమల్ హసన్ కు షాక్ ఇవ్వబోతున్నాడా..?

ఇక ఇదిలా ఉంటే 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచడం లో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే భారతీయుడు సినిమా ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక క్లాసిక్ సినిమాకి సీక్వెల్ గా సినిమాని తీస్తున్నప్పుడు దానిమీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మొదటి పార్ట్ ఎలాంటి సక్సెస్ ని సాధించిందో దాన్ని బట్టి ప్రేక్షకుల అంచనాలు కూడా తారా స్థాయిలో ఉంటాయి. వాటిని రీచ్ అవ్వాలంటే మొదటి పార్ట్ ని మించిన కథనంతో ప్రేక్షకులను అలరించాల్సిన అవసరమైతే ఉంది. కానీ ఈ విషయాల్లో శంకర్ చాలా వరకు తడబడ్డాడనే చెప్పాలి. అందువల్లే క్లాసిక్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ‘భారతీయుడు 3’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక భారతీయుడు 2 సినిమా తోనే మెప్పించలేకపోయిన శంకర్ మూడో పార్ట్ తో ప్రేక్షకుల్ని ఎలా మెస్మరైజ్ చేస్తాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే చాలామందికి ఈ ప్రాజెక్టు మీద అసలు అంచనాలు కూడా లేవు. ఎందుకంటే భారతీయుడు 2 సినిమా మీద అభిమానులు పెట్టుకున్నా అంచనాల మీద శంకర్ భారీ దెబ్బ కొట్టాడు. ఇక దాంతో భారతీయుడు 3 మీద అసలు ఏమాత్రం బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. మరి ఎందుకు శంకర్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. అప్పట్లో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక క్లాసిక్ గా మిగిలిపోయేది. ఇప్పుడు మాత్రం ఆయన తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడు.

ఇక ఏదో సినిమాలు చేస్తున్నామా అంటే చేస్తున్నాం అనేలా ఇప్పుడు తను సినిమాలు చేస్తున్నాడు తప్ప ఆయనకు ఏమాత్రం సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే లేనట్టుగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నంతో మరోసారి సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో 1987లో ‘నాయకన్ ‘ (తెలుగులో నాయకుడు) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ది బెస్ట్ టాప్ టెన్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా చోటు సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇంకా అప్పటినుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి వీళ్ళ కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ అనే సినిమా అయితే తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి మణిరత్నం కూడా అంత పెద్ద ఫామ్ లో అయితే లేడు. ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలతో సక్సెస్ కొట్టినప్పటికీ అది తమిళ్ లో మినహాయిస్తే మిగతా అన్ని భాషల్లో కూడా ప్లాప్ అయింది. మరి ఇలాంటి క్రమంలో కమల్ హాసన్ ను శంకర్ భారతీయుడు 2 తో భారీ దెబ్బ కొట్టాడు. అలాగే ఈ సినిమాతో మణిరత్నం కూడా అలాంటి ఒక భారీ షాక్ ఇవ్వబోతున్నాడా? అంటూ కమల్ హాసన్ అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో కమల్ హాసన్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది…

Also Read: ఎన్టీఆర్ తో సినిమా తీసి హుస్సేన్ సాగర్ లో దూకిన నిర్మాత… యంగ్ టైగర్ ఇమేజ్ డ్యామేజ్!

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper