Raj Tarun: రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. లావణ్య వివాదంలో యంగ్ హీరో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నార్సింగ్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. తనతో సహజీవనం చేసిన రాజ్ తరుణ్ లైంగికంగా వాడుకున్నాడు . గుడిలో రహస్య వివాహం చేసుకున్నాడు. రెండు సార్లు అబార్షన్ చేయించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడు. వదిలేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: ఎన్టీఆర్ తో సినిమా తీసి హుస్సేన్ సాగర్ లో దూకిన నిర్మాత… యంగ్ టైగర్ ఇమేజ్ డ్యామేజ్!
లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె బ్రదర్ మయాంక్ మల్హోత్రాలను A1, A2, A3గా కేసు నమోదు చేశారు. 420తో పాటు మరో రెండు సెక్షన్స్ లో బుక్ చేశారు. రాజ్ తరుణ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఈనెల 18 లోగా విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే రాజ్ తరుణ్ విచారణకు రాలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాను విచారణకు రావడం కుదరదని తన లాయర్ తో లేఖ పంపించాడని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా… రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా ప్రైవేట్ వాట్సప్ చాట్ లీకైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా లీక్ అయ్యాయి అనేది తెలియాల్సి ఉంది. మాల్వి మల్హోత్రా-రాజ్ తరుణ్ రొమాంటిక్ గా చాట్ చేసుకుంటారని తెలుస్తుంది. ఒకరికొకరు ఐ లవ్ యు చెప్పుకోవడం, ముద్దులు, హగ్గుల వంటి ప్రస్తావన ఆ చాట్ లో ఉంది. ఆ వాట్సప్ చాట్ చూస్తే వారి మధ్య ఎఫైర్ ఉందన్న భావన కలుగుతుంది.
మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తో ఎఫైర్ రూమర్స్ ఖండించిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ నాకు సహ నటుడు మాత్రమే. అతనితో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. లావణ్య నిరాధార ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వాట్సప్ చాట్ వారిదే అయితే.. మాల్వి అబద్ధం చెబుతున్నారని రుజువైనట్లే. ఇటీవల లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన ఆడియో కాల్ సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. రాజ్ తరుణ్ ని వదిలేయాలని లావణ్య ఆ కాల్ లో మాల్వితో అంటున్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి తిరగబడరసామీ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కించారు. ఆ మూవీలో రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా జంటగా నటించారు. ఈ మూవీ విడుదల ఆలస్యం అయ్యింది. ట్రైలర్ విడుదల చేసిన టీమ్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇంతలో లావణ్య వివాదం తెరపైకి వచ్చింది. తిరగబడరసామీ దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక లావణ్యతో రాజ్ తరుణ్ రిలేషన్ చాలా కాలంగా సాగుతుంది. 2008లో సోషల్ మీడియా ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. వైజాగ్ బంధువుల ఇంటికి వెళ్లిన లావణ్య మొదటిసారి రాజ్ తరుణ్ ని కలిసింది. హైదరాబాద్ వచ్చాక రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ప్రయత్నాలు చేసేవాడట. 2010లో లవ్ ప్రపోజ్ చేశాడట. 2014లో మాకు వివాహమైందని లావణ్య అంటున్నారు.
ఇక రాజ్ తరుణ్ వాదన పరిశీలిస్తే… లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ మా మధ్య ఎలాంటి శారీకర సంబంధం లేదు. ఆమెను పెళ్లి కూడా చేసుకోలేదు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది. నన్ను వేధింపులకు గురి చేసింది. బ్లాక్ మెయిల్ కి పాల్పడేది అని అంటున్నాడు…
Also Read: ‘పేక మేడలు’ ఫుల్ మూవీ రివ్యూ
Web Title: Raj tarun and heroine malvi malhotra whatsapp chat viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com