Bimbisara: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు.
కాగా, కళ్యాణ్‌రామ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా ముగించుకుని.. థియేటర్లలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా, బింబిసార టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, డిసెంబరు రేసులోనే ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు బింబిసార సినిమా టీజర్కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: హీరో రాజశేఖర్ ఆ మూవీలు చేసి ఉంటేనా?
ఈ సినిమాకు మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమకు నూతన దర్శకుడిగా పరిచయం కానున్నారు వశిస్ట్. ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తించాయి.
Also Read: ఎన్టీఆర్ తో గేమ్.. ఇంతకీ మహేష్ ఎంత గెలుచుకున్నాడంటే?