Theaters in AP: బ్రేకింగ్ : ఏపీలో థియేటర్లకు ఊరట !

Theaters in AP: సినిమా ఇండస్ట్రీకి ఒక శుభవార్త. ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా పడింది. దాంతో పండగ సీజన్‌లో థియేటర్లకు బాగా కలిసి రానుంది. రా.11 నుంచి ఉ.5 వరకూ రాత్రి కర్ఫ్యూ ఉంటే సెకండ్ షో పడే అవకాశం ఉండదు. దీంతో సింగిల్ స్క్రీన్లకు కష్టంగా మారేది. కానీ కర్ఫ్యూ వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఇక ఫుల్ షోలు వేసుకునే అవకాశం వచ్చింది. అయితే, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ నిబంధన […]

  • Written By: Neelambaram
  • Published On:
Theaters in AP: బ్రేకింగ్ : ఏపీలో థియేటర్లకు ఊరట !

Theaters in AP: సినిమా ఇండస్ట్రీకి ఒక శుభవార్త. ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా పడింది. దాంతో పండగ సీజన్‌లో థియేటర్లకు బాగా కలిసి రానుంది. రా.11 నుంచి ఉ.5 వరకూ రాత్రి కర్ఫ్యూ ఉంటే సెకండ్ షో పడే అవకాశం ఉండదు. దీంతో సింగిల్ స్క్రీన్లకు కష్టంగా మారేది. కానీ కర్ఫ్యూ వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఇక ఫుల్ షోలు వేసుకునే అవకాశం వచ్చింది. అయితే, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ నిబంధన మాత్రం కొనసాగబోతుంది.

Theaters in AP

Theaters in AP:

ఇదే విషయం పై చిన్న చిత్రాల నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సీఎం జగన్‌ కు ఒక లేఖ రాశారు. ‘థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మంచిదే. కానీ పండగ సినిమాల కోసం వారం రోజుల పాటు .. థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతివ్వాలి. రాత్రిపూట అదనంగా ఇంకో గంట వెసులుబాటు కల్పించాలి. సెకండ్ షో కోసం రా.12గం. వరకు అనుమతివ్వాలి’ అని లేఖలో కోరారు. కానీ అనుమతి లభించడం కుదిరే పని కాదు.

Also Read: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. ‘వాసి వాడి తస్సదియ్యా’..!

అయినా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో పెద్ద సినిమా ఒక్క బంగార్రాజు మాత్రమే. ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమాగా ‘రౌడీబాయ్స్‌’ రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ చాలా ముహ్యం. ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా పడటం చాలా మేలు చేసే అంశం.

Also Read: కీర్తి సురేష్ కి కరోనా… కారణం మహేషేనా ?

Tags

    follow us