Nithin wife Shalini birthday celebrations : హీరో నితిన్ మంచి లవర్ బాయ్. అందుకే, తన భార్య శాలిని పుట్టినరోజును వెరైటీగా సెలబ్రేట్ చేసి ఆమెకు ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. శాలినికి కరోనా సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంది. అయితే, నితిన్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే.. ఇంటిముందు గార్డెన్లో కేక్ కట్చేసి శాలినికి తన ప్రత్యేక విషెస్ చెప్పాడు. కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ శాలిని అనందంతో తెగ మురిసిపోయింది.
‘కరోనాకే అడ్డంకులు ఉంటాయి. ప్రేమకు కాదు. లైఫ్లో మొదటిసారి నువ్వు నెగెటివ్ కావాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే మై లవ్’ అని నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాదిలో నితిన్ మూడు చిత్రాలు చేశాడు. ‘రంగ్ దే’, ‘చెక్’, ‘మాస్ట్రో’… ఈ మూడు హిట్ కాలేకపోయాయి. మొత్తానికి నితిన్ కి 2021 పూర్తిగా కలసిరాలేదు.
మరి ఈ 2022 అయినా కలిసి వస్తోందేమో చూడాలి. ఎంతైనా నితిన్ మాస్ హీరో అవాలని చాలా ఆశ పడుతున్నాడు. నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావు, లవ్ స్టోరీలు బాగా సెట్ అవుతాయి. కాకపోతే, నితిన్ కి ఉన్న ఏకైక కోరిక.. మాస్ హీరో అవాలని, అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఓ మాస్ సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు.