Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలిపారు. అందులో ప్రేమ గురించి కూడా బోధించారు. మరి ఈ ప్రేమ ఎలా ఉండాలి. ఎలా ఉంటే ఆ జంటలు బాగుంటాయో తెలిపారు. ఒకసారి వాటి గురించి కూడా చదివేసేయండి. ఏ బంధమైన కొనసాగించే వారిపై ఆధారపడి ఉంటుందని.. ఒకవేళ ప్రేమికుల మధ్య సంబంధం బలహీనంగా ఉంటే, వారు విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు అన్నారు.
అయితే బంధం బలంగా ఉండాలంటే కొన్ని పాటించాలని.. వాటిని పాటిస్తే.. టెన్షన్ అసలు ఉండదని అన్నారు. వ్యక్తి తన భాగస్వామిని కచ్చితంగా గౌరవించాలి. అంతేకాదు ఇతరుల ముందు కించపరచకూడదు. అలా చేస్తే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాదు గౌరవాన్ని కూడా కోల్పోతారని తెలిపారు చాణక్యుడు. దీని వల్ల ప్రేమలో గొడవలు ఏర్పడి ఆ ప్రేమ విఫలం కూడా అవుతుంది అన్నారు.
అందుకే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని తెలిపారు. ఇక ఎవరిని అయిన ప్రేమిస్తే ముందుగా ఇగోను పక్కన పెట్టాలన్నారు. దీని వల్ల అశాంతి ఏర్పడి ప్రేమను కోల్పోతారని.. అందువల్ల అహాన్ని పక్కన పెట్టాలన్నారు. ఇక ఎవరిని అయినా ప్రేమిస్తే.. వారిపై విశ్వాసంగా ఉండాలట. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నమ్మకమే బలం. దీని వల్ల ఎంతటి కష్టమైన సవాలు అయినా సులభంగా ఎదుర్కోవచ్చు అని చెప్పారు.
మరోవైపు నమ్మకాన్ని అనుమానించే సంబంధం తేలికపాటి గొడవతో విచ్చిన్నమవుతుంది. రిలేషన్ షిప్ లో స్వేచ్ఛ ఉండటం చాలా ముఖ్యం. స్వేచ్ఛ ఉన్న సంబంధాల కంటే పరిమితులు ఉన్న సంబంధాలు బలంగా ఉండవు. స్వేచ్ఛ లేని సంబంధాలు, కొంతకాలం తర్వాత వారు విసుగు చెందడం ప్రారంభిస్తారు.