China- Taiwan: తైవాన్ విషయంలో డ్రాగన్ రెచ్చిపోతోంది. చిన్న దేశాన్ని కైవసం చేసుకోవాలని కుట్రలు చేస్తోంది. తైవాన్ తమ భూభాగంలో ఉందని బుకాయిస్తోంది. కానీ తైవాన్ ఓ స్వతంత్ర దేశమని దానికి తాము అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందులో భాగంగానే స్పీకర్ నాన్సి పెలోసీ పర్యటనతో చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో తైవాన్ తో యుద్ధానికైనా సిద్ధమేనంటూ డ్రాగన్ చెబుతుంటే అమెరికా మాత్రం తైవాన్ కు ఎలాంటి హాని చేసినా ఊరుకోబోమని హెచ్చరించింది. దీంతో అగ్రరాజ్యం తైవాన్ విషయంలో ఎంతకైనా తెగిస్తామని చెబుతుండటంతో ఇక యుద్ధమేనా అనే అనుమానాలు వస్తున్నాయి.
మరోవైపు చైనా యుద్ధ విమానాలను తైవాన్ సమీపంలో దించుతోంది. కవ్వింపు చర్యలకు పాల్పడకున్నా తైవాన్ కు మాత్రం భయం కలుగజేస్తోంది. దీనిపై తైవాన్ కూడా అంతే స్థాయిలో బదులిస్తోంది. తాము కూడా దేనికైనా రెడీ అని సవాలు విసురుతోంది. దీంతో డ్రాగన్ కుయుక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనా ఎన్ని కుట్రలు చేసినా తమ భూభాగంలోకి రానివ్వమని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ తైవాన్ ను భయపెట్టాలని చూస్తున్నా బెదరడం లేదు.
Also Read: National Flag : జాతీయ జెండా ఎలా మడవాలి? ప్రభుత్వం సూచనలివీ?
స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో చైనాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తైవాన్ విషయంలో అమెరికా ప్రోద్బలమేమిటని ప్రశ్నిస్తోంది. తైవాన్ ను తమ దారికి తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చైనాకు నిద్ర పట్టడం లేదు. దీంతో తైవాన్ ను భయంతోనైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూడటంతో అమెరికా తైవాన్ కు అండగా నిలుస్తోంది. యుద్ధమే వస్తే తాము కూడా సిద్ధమే అని అమెరికా చెబుతోంది. చైనా కుట్రలను తిప్పికొడతామని అమెరికా కూడా ప్రకటించడంతో చైనా యుద్ధానికి దిగుతోందా? అమెరికాను తట్టుకుంటుందా? అగ్రరాజ్యం అమెరికా తైవాన్ కోసం ఎలాంటి సాయానికైనా వెనుకాడబోమని చెబుతోంది.
చైనా కూడా తైవాన్ పై యుద్ధానికి భయపడుతోంది. అమెరికా అండగా ఉండటంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఒక వేళ యుద్ధానికి దిగితే ఉక్రెయిన్ విషయంలో రష్యా మాదిరి అంతర్జాతీయ సమాజంలో ఒంటరి కావలసి వస్తుందని భయపడుతోంది. ప్రస్తుతం రష్యా పరిస్థితి అలాగే తయారయింది. అందుకే చైనా యుద్ధానికి సిద్ధమైనా వెనకడుగు వేస్తోంది. తైవాన్ తో యుద్ధం చేస్తే వచ్చే నష్టాలపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే తైవాన్ ను తమ దారికి తెచ్చుకోవాలని చూసినా కుదరడం లేదు. దీంతో భవిష్యత్ పరిణామాలపై భయంతోనే డ్రాగన్ ఆలోచిస్తుందని సమాచారం. ఈ క్రమంలో తైవాన్ చిన్న దేశమైనా డ్రాగన్ ను కూడా తన చేష్టలతో భయాందోళనలకు గురిచేయడం గమనార్హం.
తైవాన్ కు అమెరికా పూర్తిస్థాయిలో అండగా ఉండేందుకు నిర్ణయించుకుంది. స్వతంత్ర రాజ్యంగానే తైవాన్ ను గుర్తించాలని చెబుతున్నా చైనా మాత్రం వినిపించుకోవడం లేదు. దీంతోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు. మూడో ప్రపంచ యుద్ధానికే ఈ పరిస్థితులు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, డ్రాగన్ తైవాన్ విషయంలో బద్ధ శత్రువులుగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు కూడా రెండు దేశాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:VRO’s Concern: వీఆర్వోల ఆందోళన పొలిటికల్ టర్న్.. 121 జీవోపై విపక్షాల నిరసన