Chanakya Niti Friendship: చాణక్య నీతి: ఎలాంటి స్నేహితుడు ఉంటే మనకు కలిసొస్తుందో తెలుసా?

ఆచార్య చాణక్యుడి ప్రకారం సరైన సమయం, సరైన స్నేహితుడు, స్థలం, డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించాలి. డబ్బు ఖర్చు చేయడానికి సరైన మార్గం శక్తి వనరులు పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి భవిష్యత్ లో మనకు ఉపయోగపడతాయి. సమయం వచ్చినప్పుడే మనకు విజయాలు దగ్గరవుతాయి. అంతవరకు మనం వేచి ఉండాలి.

  • Written By: Shankar
  • Published On:
Chanakya Niti Friendship: చాణక్య నీతి: ఎలాంటి స్నేహితుడు ఉంటే మనకు కలిసొస్తుందో తెలుసా?

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నేటి తరం వారు సైతం ఆచరించే విషయాలు సూచించాడు. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తితో చిరకాలం జీవించాలని కోరుకుంటాడు. జీవితంలో విజయం అందుకోవాలంటే చాలా విషయాలు మార్చుకోవాలి. జీవితంలో ఎదిగేందుకు పలు మార్గాలు అన్వేషించాలని సూచించాడు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం సరైన సమయం, సరైన స్నేహితుడు, స్థలం, డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించాలి. డబ్బు ఖర్చు చేయడానికి సరైన మార్గం శక్తి వనరులు పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి భవిష్యత్ లో మనకు ఉపయోగపడతాయి. సమయం వచ్చినప్పుడే మనకు విజయాలు దగ్గరవుతాయి. అంతవరకు మనం వేచి ఉండాలి.

ప్రవర్తన

ఆచార్య చాణక్య ప్రకారం మనిషి ప్రవర్తనలో మంచితనం ఉండాలి. అదే మనకు కలకాలం వెంట నిలుస్తుంది. చక్కగా ఉన్న చెట్లను నరికినట్లే మంచి వాడికి కష్టాలురావడం సహజమే. చెడ్డ వారిని ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైనా కాసిన చెట్టుకే దెబ్బలు. కాయనిచెట్టును ఎవరు పట్టించుకోరు. చెట్టుకు పండ్లుంటేనే పక్షులు ఉంటాయి. లేదంటే ఏ పక్షి కూడా తన దగ్గరకు రావడానికి ఇష్టపడవు.

మంచి నిర్ణయం

మనిషి జీవితంలో అశాశ్వతమైన వాటి కోసం పరుగులు పెట్టకూడదు. స్థిరమైన చిత్తం కలిగి ఉండాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. మంచి విషయాలపై ఫోకస్ పెట్టాలి. అస్థిరమైన విషయాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో మనిషి తన మార్గంలో తప్పులు లేకుండా చూసుకుంటే మంచిది. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి.

హద్దులు మరిచిపోకూడదు

చాణక్యుడి ప్రకారం మనిషి ఎప్పుడు హద్దులు దాటకూడదు. మితిమీరి ప్రవర్తించకూడదు. అతి చేయకూడదు. ఇవి తన పతనాన్ని శాసిస్తాయి. తప్పు ఒప్పులను బేరీజు వేసుకోవాలి. గంభీరంగా ఉండే పనులు చేయాలి. కానీ పరువు తీసుకునేలా ప్రవర్తించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా తన పరిమితులు దాటకూడదు. ఉత్తమ లక్ష్యాలు కలిగి ఉండి మంచి పనులు చేసేందుకే మొగ్గు చూపాలి.

సంబంధిత వార్తలు