Martin Luther King Review: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకుంటు ఉంటాయి. అందులో కొన్ని మూవీస్ వైవిధ్యమైన కథాంశంతో వచ్చి ప్రేక్షకులను ఆధ్యాంతం అలరిస్తూ సూపర్ సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం విజయాన్ని అందుకోలేక డీలా పడుతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఈరోజు రిలీజ్ అయిన సంపూర్ణేష్ బాబు సినిమా అయినా మార్టిన్ లుతర్ కింగ్ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా ఈ కథ విషయానికి వస్తే ఒక ఊరిలో ఉత్తరాన ఒక కులం, దక్షిణాన మరొక కులం వాళ్లు నివసిస్తూ ఉంటారు. ఇక ఈ ఊరు పెద్దాయన రెండు కులాలకు చెందిన వాళ్లను పెళ్లి చేసుకొని రెండు కులాలను సమానంగా పాలిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో ఆయన పెద్ద భార్యకి జగ్గి ( నరేష్), చిన్న భార్యకి లోకి (వెంకటేష్ మహా) అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. ఇక వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయి. అందుకు ఊరు బలవుతుంటుంది ఇక ఊర్లో ఉన్న రోడ్లు, మరుగుదొడ్లు అన్నింటిని ఆ ఊరి ప్రజలు ధ్వంసం చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే అనాధాశ్రమంలో ఎడ్డోడు (సంపూర్ణేష్ బాబు) తనతోపాటు ఉండే చిన్నోడితో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అప్పుడే ఆయన డబ్బులు దాచుకోవడానికి ఒక అకౌంట్ ను ఓపెన్ చేస్తాడు.ఇక ఈ క్రమం లో ఆయన పేరు మీద ఒక ఓటరు కార్డ్ కూడా రావడం జరుగుతుంది.ఇక ఇలాంటి టైంలో ఊరిలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. ఇక ఈ టైం లో ఇద్దరికీ సమానమైన ఓట్లు రావడం జరుగుతుంది దాంతో కొత్తగా ఓటర్ కార్డ్ వచ్చిన ఎడ్డొడు ఎవరికి ఓటు వేస్తారు అనేదే ఈ సినిమా కథ…
ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి మనం బ్రీఫ్ అనాలసిస్ లో ద్వారా తెలుసుకుందాం…
ఈ సినిమాని తమిళంలో వచ్చిన మండేలా సినిమా కి రీమేక్ గా తెరెకెక్కించారు. ఈ సినిమా డైరెక్టర్ అయిన పూజ కొల్లూరు ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు అనే చెప్పాలి. పొలిటికల్ జానర్ లో సెటైరికల్ గా నడిచే సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా లాస్ట్ వరకు ఫుల్ ఆఫ్ అన్ని ఎంగేజ్ చేస్తూ సినిమాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విషయంలో పూజ గారికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టుని డీల్ చేయాలంటే మినిమం ఒక త్రీ, ఫోర్ మూవీస్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. కానీ ఈమె సినిమాని చాలా సిన్సిటివ్ గా డీల్ చేసి సక్సెస్ ను సాధించింది…
ఈ సినిమాలో నటుల పర్ఫామెన్ లా విషయానికి వస్తే నరేష్ ,వెంకటేష్ మహా ఇద్దరు కూడా వాళ్ల కులం తరపున పోరాడుతూ వాళ్ళు చేసే ఫన్ అనేది సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక ఎడ్డోడు క్యారెక్టర్ లో సంపూర్ణేష్ బాబు ఇంతకుముందు తను చేసిన కొబ్బరి మట్ట, కాలిఫ్లవర్, హృదయ కాలేయం లాంటి సినిమాలను మించి ఈ సినిమాలో ఒక కొత్తరకం కామెడీని జనరేట్ చేశాడు. తన నటనలో ఒక కొత్త కోణాన్ని మనం ఈ సినిమాలో చూడొచ్చు అందుకే ఈ సినిమా అనేది అధ్యంతం ప్రేక్షకులను అలరిస్తూ డీసెంట్ హిట్ గా నిలుస్తుందనే చెప్పాలి…
ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన దీపక్ యరగెరా చాలా అద్భుతమైన విజువల్స్ అందించడానే చెప్పాలి. డైరెక్టర్ ఉన్న బడ్జెట్లోనే చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తీయడం జరిగింది.
ఇక ఈ సినిమాకి ఎడిటర్ అయిన పూజ కొల్లూరు తన డైరెక్షన్ చేసి ఎడిటింగ్ కూడా తనే చేయడం జరిగింది.ఎడిటింగ్ లో కొద్ది వరకు ఇంకా షార్ప్ కట్ చేసి ఉంటే బాగుండేది అన్నట్టుగా ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు… ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన స్మరణ్ సాయి చాలా అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడనే చెప్పాలి…ఇక ఈ సినిమాకి రైటర్ గా వెంకటేష్ మహా అద్భుతమైన డైలాగ్స్ ని అందించాడు.ఈ సినిమాని కామెడీ గా ఒక పొలిటికల్ సెటైరికల్ సినిమా గా చాలా బాగా చేశారు అనే చెప్పాలి…ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉండటంతో ఈ సినిమా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి…
ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆర్టిస్టుల పర్ఫామెన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు ఎడ్డోడు క్యారెక్టర్ లో అద్భుతంగా చేశాడనే చెప్పాలి. పూజ కొల్లూరు డైరెక్షన్ కూడా ఈ సినిమా చాలా వరకు ప్లస్ అయింది…
ఇక మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ అనేది సింగిల్ ప్లాట్ లో ఉండడం వల్ల భారీగా ఎక్స్పండ్ అవ్వడానికి వీలు లేకుండా పరిమితి మేరకే సినిమాను చేయడం జరిగింది కాబట్టి ఇది ఈ సినిమాకి మైనస్ పాయింట్ అనే చెప్పాలి…
ఇక ఎడిటింగ్ కూడా ఇంకా కొంచం బాగా చేసి ఉంట్ బాగుండేది…ఈ సినిమా ఒరిజినల్ లో ఉన్న ఫ్లేవర్ ని 70% మాత్రమే రీ క్రియేట్ చేసింది…
ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5