ఎయిర్ ఫోర్స్ పైలట్ గా మారిన కంగనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజా మూవీ ‘తేజస్’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఛాలెంజింగ్ రోల్స్ ను అవలీలగా చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కంగనా మరోసారి ఫిదా చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తుంది. ‘తేజస్’లో కంగనా ఫస్టు లుక్కు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్టిల్ చూస్తే కంగానా ‘తేజస్’ యుద్ధ విమానాన్ని నడిపి అప్పుడే ల్యాండ్ […]

  • Written By: Neelambaram
  • Published On:
ఎయిర్ ఫోర్స్ పైలట్ గా మారిన కంగనా

Follow us on

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజా మూవీ ‘తేజస్’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఛాలెంజింగ్ రోల్స్ ను అవలీలగా చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కంగనా మరోసారి ఫిదా చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తుంది. ‘తేజస్’లో కంగనా ఫస్టు లుక్కు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్టిల్ చూస్తే కంగానా ‘తేజస్’ యుద్ధ విమానాన్ని నడిపి అప్పుడే ల్యాండ్ చేసినట్టు కన్పిస్తుంది. ఫైలట్ యూనిఫాంలో ఠీవి నడుచుకుంటూ వస్తూ కన్పిస్తుంది. యూనిఫాంలో కంగనా ఫర్ఫెక్ట్ గా ఒదిగిపోయింది.

‘తేజస్’ మూవీని సర్వేశ్ మేవర అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఎస్వీపీ ప్రొడక్షన్ పతాకంపై రోని స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ‘ఉరి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశ సైనికుల కథాంశంతో ‘ఉరి’ మూవీ తెరకెక్కి పలు అవార్డులను కూడా గెలుచుకుంది. కాగా ఎయిర్స్ ఫోర్స్ కథాంశంతో ‘తేజస్’ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని వచ్చే 2021 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

ప్రస్తుతం కంగనా రనౌత్ ‘క్వీన్’, ‘మణికర్ణిక’ సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తుంది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవీ’ మూవీలో జయలలితగా నటిస్తుంది. వరుసగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు రాబడుతూ కంగనా రనౌత్ బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటుంది.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు