Prabhas : ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. ముఖ్యంగా యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ యూత్ కి పెళ్లి అసలు పెద్ద మ్యాటర్ కాకుండా పోయింది. కెరీర్, సక్సెస్ అంటూ పెళ్లి వ్యవహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ముప్పై ఏళ్ళు దాటినా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సెలబ్రిటీలు అయితే మరింత దారుణం. పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన హీరోలు, హీరోయిన్స్, యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సోలో లైఫ్ సో బెటర్ అని బ్రతికేస్తున్నారు.
ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా చేరాడు అనేది చాలా మంది వాదన. ప్రభాస్ ఏజ్ 40 ప్లస్. ఈపాటికే ఆయనకు పెళ్ళై, పిల్లలు కూడా ఉండాలి. కానీ ప్రభాస్ ఇంకా వివాహం చేసుకోలేదు. ప్రభాస్ సమకాలీన హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ చక్కగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఒకరిద్దరు చొప్పున పిల్లల్ని కన్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కుమారులు అయితే… సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యారు.
ప్రభాస్ ని వివాహం గురించి అడిగితే ఇబ్బందిపడతారు. బహుశా అందుకే పెద్దగా ఇంటర్వ్యూలకు హాజరు కాడేమో అనిపిస్తుంది. కల్కి మూవీ ప్రమోషన్స్ కూడా పైపైన లాగించేశాడు ప్రభాస్. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మాత్రం ఎంతో కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ సిల్లీ సమాధానాలు చెప్పి తప్పించుకున్నారు. మనసులో ఉన్న అసలు మాట బయటపెట్టలేదు.
అయితే ప్రభాస్ పెద్దమ్మ మాత్రం తరచుగా ఆయన వివాహంని ఉద్దేశించి కామెంట్స్ చేస్తుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ పడదు అన్నారు. కల్కి మూవీతో భారీ విజయం అందుకున్నాడు. ప్రభాస్ పెళ్లి కూడా అంతే. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి అన్నారు. తాజాగా శ్యామలాదేవి చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారి తీశాయి.
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు భార్య గాయత్రీ మరొక పార్ట్నర్ తో కలిసి హైదరాబాద్ లో శారీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ శారీ స్టోర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా శ్యామలాదేవి, హైదరాబాద్ మేయర్, పలాస హీరో రక్షిత్ హాజరయ్యారు. స్టోర్ ప్రారంభోత్సవం అనంతరం శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు. నాకు పట్టుచీరలు అంటే చాలా ఇష్టం. కృష్ణంరాజు నాకు మొదటిసారి కంచి పట్టు చీర కొనిపించారు. ఈ శారీ స్టోర్ లో మంచి కలెక్షన్ ఉంది. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే చేస్తాము… అన్నారు.
ప్రభాస్ పెళ్ళికి షాపింగ్ ఇక్కడే చేస్తాం అని ప్లేస్ ఫిక్స్ చేసిన శ్యామలాదేవి కామెంట్స్ ఊహాగానాలకు దారి తీశాయి. శ్యామలాదేవి ఏకంగా పెళ్లి షాపింగ్ గురించి మాట్లాడుతుంది అంటే అమ్మాయి సెట్ అయ్యిందా? త్వరలో పెళ్లి భాజా మోగనుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది.
సలార్ 2, కల్కి 2 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీకి కమిట్ అయ్యాడు. అలాగే సీతారామం దర్శకుడు హను రాఘవపూడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది.
Web Title: Once again prabhas aunty shyamala devi hints about his marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com