Jagan: గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రెస్ కు దూరంగా ఉన్నారు. మీడియా సమావేశాలు పెట్టిన దాఖలాలు కూడా లేవు. సీఎం గా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వీడియో రికార్డు చేసి విడుదల చేసేవారు. ఢిల్లీ పర్యటనలకు వెళితే ప్రెస్ నోట్ జారీ చేసేవారు. మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరితే సాయి రెడ్డి మాట్లాడుతాడంటూ తప్పించుకునేవారు. ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే జాతీయ మీడియాకు పిలిచి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చుకునేవారు. అయితే అధికారంలో ఉన్నంతవరకు అది చెల్లుబాటు అవుతుంది. అధికారం పోతే మాత్రం తత్వం బోధపడుతుంది. ప్రస్తుతం జగన్ మీడియాతో మాట్లాడాలనుకున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఇప్పుడు దాని పర్యవసానాలతో పాటు చంద్రబాబు శ్వేత పత్రాలపై కౌంటర్ ఇవ్వాలని భావించారు. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ప్రెస్ మీట్ కు వెళ్ళిన మీడియా ప్రతినిధులకు షాప్ ఇచ్చారు. ప్రెస్ మీట్ కు వచ్చేవారు కెమెరాలు తీసుకురావద్దు.సాధారణంగా మీడియా ప్రతినిధులు కెమెరాలతో హాజరవుతారు.అయితే వైసిపి వర్గాలు మాత్రం కెమెరాలు తేవద్దని ఆదేశాలు ఇచ్చాయి. ఒకవేళ కెమెరాతో హాజరైతే తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంగణాలు ఫోటోలు తీస్తారని.. అందుకే తేవద్దని చెప్పామని వైసిపి వర్గాలు అంతర్గత చర్చలో చెప్పుకుంటున్నాయి. అయితే మీడియాతో మాట్లాడింది అరుదు.. ఈ ఆంక్షలు ఏమిటని మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడు ఎదురు కాలేదని చెబుతున్నారు.
* చంద్రబాబుకు మంచి అనుబంధం
చంద్రబాబు సీఎం అయ్యాక మీడియా ప్రతినిధులతో జగన్ వైఖరిని గుర్తు చేశారు. తాను మీడియాతో మాట్లాడినప్పుడు చాలామంది ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ స్వేచ్ఛగా సమాధానం చెప్పిన చంద్రబాబు.. తాను ఎప్పుడూ మీడియాతో సన్నిహితంగా గడుపుతానని.. జగన్ లా ఎస్కేప్ కానని చెప్పుకొచ్చారు. అది నిజమేనని మీడియా ప్రతినిధులు సైతం ఒప్పుకున్నారు. మీడియాతో చంద్రబాబు ఎంతో క్లోజ్ గా గడుపుతారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. కానీ జగన్ వద్ద ఆ పరిస్థితి లేదు.
* ప్యాలెస్ లోకి నో ఎంట్రీ
విపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టారు జగన్. సర్వాంగ సుందరంగా.. సకల వసతులతో నిర్మించారు. అక్కడకు సామాన్యులతో కాదు మీడియాకు సైతం ఇంతవరకు ఎంట్రీ లేదు. చాలామంది మీడియా ప్రతినిధులు తాడేపల్లి ప్యాలెస్ బయట ఎక్కువగా కనిపిస్తారు. అటు నిఘవర్గాల భద్రత కూడా ఉంటుంది. అటువైపుగా వెళ్లకూడదు కూడా. గతంలో కొందరు యూట్యూబ్లో తాడేపల్లి ప్యాలెస్ ను బయట నుంచి చూపించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయేసరికి యూట్యూబ్లో కొందరు ఆ ప్యాలెస్ ను బయట నుంచి చూపించే ప్రయత్నం చేశారు.
* సొంత మీడియాకు నో ఛాన్స్
చివరకు సొంత మీడియా కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఎంట్రీ లేదు. సొంత మీడియా సాక్షి ఉంది. వైసిపి పల్లకి మోసే ఎన్టీవీ, టీవీ9 వంటి ఛానళ్లు ఉన్నాయి. కానీ వాటి ప్రతినిధులకు సంబంధించి కూడా మినహాయింపు లేదు. నేషనల్ మీడియాతో పాటు అనుకూల మీడియా ఛానళ్ల అధినేతల వరకు మాత్రం కాస్త మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆంక్షలు నడుమ ప్రెస్ మీట్ పెట్టడం.. మీడియా వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More