Homeక్రీడలుKohli One8 Commune Menu: నోరూరించే వంటకాలు.. అదరగొట్టే రుచులు.. విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్...

Kohli One8 Commune Menu: నోరూరించే వంటకాలు.. అదరగొట్టే రుచులు.. విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్ రెస్టారెంట్ లో మెనూ ఇలా ఉంటుంది..

Kohli One8 Commune Menu: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల హైదరాబాద్ హైటెక్ సిటీలో one 8 commune అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు.. ఈ రెస్టారెంట్ ప్రారంభించిన ఆనతి కాలంలోనే విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. లేత గోధుమ రంగు, మట్టి మిశ్రమంతో ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇంటీరియర్ ను విరాట్ కోహ్లీ టేస్ట్ కు తగ్గట్టుగానే రూపొందించారు. కేన్ ఫర్నిచర్, దీపాలు, ఫ్యాన్లు, మెటల్, గ్లాస్ వంటి వాటితో అప్సెట్ చేశారు.. నీలం, బంగారం వంటి ప్రకాశవంతమైన రంగులతో అక్కడక్కడ చిత్రాల రూపొందించారు. ఎత్తైన, అధునాతనమైన సీటింగ్ కెపాసిటీ ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ఈ రెస్టారెంట్లో వీనుల విందైన సంగీతం అలరిస్తూ ఉంటుంది. ప్రపంచ స్థాయి డిసర్ట్స్, ఆహారం, పానీయాలు ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయి.

ఇక్కడ మెనూ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. క్రికెటర్లు ఎంతగానో ఇష్టపడే పుట్టగొడుగుల క్రీమ్, అవకాడో చీజ్ గూగ్లీ వంటివి ఇక్కడి మెనూలో ఉన్నాయి.. స్టీమ్డ్ డిమ్ సమ్ రాప్ నుంచి బీట్రూట్ రసం తీయడం ఇక్కడ ప్రత్యేకత. దానికి వెల్లుల్లి, ఇతర సుగంధద్రవ్యాలు అనుసంధానం నుంచి పానీయం రూపొందిస్తారు. ఈ పానీయం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత అని చెఫ్ లు చెబుతున్నారు. నెయ్యిపై కాల్చిన మాష్రూమ్, కూల్చా ఇక్కడి ప్రత్యేకమైన వంటకాలలో ఒకటి. ఈ రెస్టారెంట్లో ప్రత్యేకమైన బార్ కూడా ఉంది. జిన్, వోడ్కా వంటివి అందుబాటులో ఉంటాయి.. వాటిలోకి సర్వ్ చేసేందుకు మామిడి పికాంటే అనే స్పైసీ డిష్ కూడా అందుబాటులో ఉంటుంది. టేకిలా ప్రేమికులు ఈ స్పైసీ డిష్ ను ఆస్వాదిస్తూ.. సంగీతాన్ని ఆనందిస్తూ.. రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ రెస్టారెంట్ కార్పొరేట్ చెఫ్ గా ముడి అగ్నిభ్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వండే ప్రతి వంటకాన్ని ఆయన రుచి చూస్తారు. వెస్ట్రన్, కాంటినెంటల్, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ వంటి కేటగిరీలలో ఇక్కడ వంటకాలు తయారు చేస్తున్నారు. అయితే గ్లోబల్ అనే థీమ్ తో రూపొందిన విరాట్ కోహ్లీ రెస్టారెంట్లో స్థానిక రుచులకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్లో చికెన్, రొయ్యలు, పన్నీర్ లతో సరికొత్త వంటకాలను తయారు చేస్తుంటారు. హైదరాబాద్ కట్టి దాల్, అండా కీమా, పావ్ వంటి వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభ్యమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో సోయాతో హలీం ఎలా తయారు చేయాలనే విషయంపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

బైడ్గి మిర్చి, పన్నీర్, లైమ్ చిల్లీ పిక్ల్ డ్ స్పైసి రొయ్యలు, కరివేపాకు పట్టా తడ్కా, అవకాడో ప్లాట్ బ్రెడ్, పిజ్జా, మటన్ రోగన్ జోష్, ఆకర్ స్టైల్ నూడిల్స్, పాస్తా, స్పగెట్టి అగ్లియో ఇ ఒలియో, పెన్నె గ్రిల్ సాల్మన్ వరకు అనేక రకాలైన వంటకాలు ఈ రెస్టారెంట్లో లభ్యమవుతున్నాయి. ఇక డిసర్ట్ విభాగంలో తీరా మిస్సు కార్నెటో, కాల్చిన బాస్క్ చీజ్, కొబ్బరి ట్రెస్ లెచెస్, డబల్ క మీఠా, కద్దూ కా ఖీర్, సేమియా పాయసం, దూద్ కీ తికిడి, గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా, కాలా రసగుల్లా వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. గ్లోబల్ థీమ్ తో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వంటకాలు మొత్తం గ్లోబల్ స్థాయిలో ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే మెనూలో స్థానిక వంటకాలను కూడా చేర్చడంతో ఆహార ప్రియులు లొట్టలు వేసుకుని తింటున్నారని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular