Pakistan: మన దాయాది దేశం పాకిస్తాన్. దేశ విభజన జరిగిన నాటి నుంచి భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది. భారత్ అభివృద్ధి చెందకుండా, భారత్‌లో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకు ఉగ్రవాద సంస్థలకు సహకారం అందిస్తోంది. సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత వ్యతిరేక దేశాలతో దోస్తీ చేస్తుంది. అయితే దీని ఫలితంగా పాకిస్తాన్‌ను ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాద స్థావర దేశంగా గుర్తించింది. అమెరికా, రష్టా లాంటి అగ్ర దేశాలు కూడా తీవ్రవాదులను ఏరివేయాలని సూచించాయి. అయినా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. కేవలం భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు పెరిగాయి. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అన్న చదంగా ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూరుస్తున్న ఆదేశం ఉగ్రవాదుల కారణంగానే తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఆ దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక సంస్యలు తీవ్రమయ్యాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతొ అక్కడి ప్రజలు పాకిస్తాన్‌పై తిరగబడుతున్నారు. మరోవైపు పీవోకేలోని పలు ప్రాంతాల ప్రజలు తమను భారత్‌లో కలపాలని ఆందోళనలు చేస్తున్నారు. పీవోకే అభివృద్ధిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడుతున్నారు. ఒకవైపు ప్రపంచ దేశాల మద్దతు కోల్పోతున్న పాకిస్తాన్.. ఆర్థిక సమస్యలు, అభివృద్ధిలో నిర్లక్ష్యం, యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం కారణంగా ఆదేశ ప్రజల మద్దతు కూడా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి నమ్ముకున్న ఉగ్రవాద సంస్థల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆ దేశ అధ్యక్షుడిపై ఉగ్రవాద ముద్ర..
ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ఎప్పుడో కల్పోయిన ఉగ్రవాద మద్దతు దేశం పాకిస్తాన్. తమ పాలనా వైఫల్యాలతో ఇప్పుడు ప్రజల నుంచి కూడా మద్దతు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ తాము మద్దతు ఇస్తున్న ఉగ్రవాద సమస్థల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే హమాస్‌పై దాదాపు ఆరు నెలలుగా యుద్ధం చేస్తున్న హమాస్‌కు మొదటి నుంచి పాకిస్తాన్ మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహును పాకిస్తాన్ మీడియా ఉగ్రవాదిగా ప్రకటించింది. మీడియాకు మద్దతుగానే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇప్పుడు నెతన్యాహును ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.
ఇరాన్ ప్రోత్సాహంతో…
పాలస్తీనాలో ఉన్న హమాస్, యెమెన్‌లో ఉన్న హౌతీ, ఇరాన్‌లో ఉన్న హిజ్బుల్లా, సిరియాలోని ఇస్లామిక్ రెసిస్టెన్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్.. వీటన్నింటినీ నడిపించేది ఇరాన్.. ఇరాన్ ఇటు భారత్‌తో, అటు పాకిస్తాన్‌తో స్నేహంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తీవ్రవాద సంస్థల మెప్పు పొందాలన్న ఆలోచనతో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహును తీవ్రవాదిగా గుర్తించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా హైలెట్ చేసింది.
పాకిస్తాన్‌ను అభినందించిన హమాస్..
పాకిస్తాన్ ఏది ఆశించి బెంజిమెన్ నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటించిందో ఆ లక్ష్యం నెరవేరినట్లుగానే కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని తీవ్రవాద సంస్థ అయిన హమాస్.. పాకిస్తాన్‌ను అభినందించింది. అంటే దీనిని బట్టి పాకిస్తాన్ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pakistan has identified israeli prime minister netanyahu as a terrorist
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com