Hyderabad : ఆర్థిక కష్టాలు ఎంతటి వారినైనా ఇబ్బంది పెడతాయి. అవసరాలు తీరే మార్గం కనిపించక కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తాయి. అలాంటి నిర్ణయం ఒక కుటుంబాన్ని కకావికలం చేసింది. విధి రాసిన బలీయమైన రాతకు ఆ కుటుంబం బలైంది. చూస్తుండగానే ఒక్కొక్కరు చనిపోవడం కలచివేస్తోంది. మొన్నటి దాకా ఆ నలుగురు ఒక ఇంట్లో నివాసం ఉన్నారు. ఆ ఇంటి పెద్ద, ఆమె భార్య చెరో పని చేసి ఆ ఇద్దరు పిల్లల్ని సాకే వారు. వారిని స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో చదివించేవారు. ఆ ఇంటి పెద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. హరి భార్య స్థానికంగా ఉన్న సంస్థలో దినసరి కూలిగా పని చేసేది. వీరు ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఉన్నంతలో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవాళ్లు. ఆ ఇంటి పెద్ద కూడా సెలవులు దొరికినప్పుడల్లా ఇతర పనులకు వెళ్లేవాడు. అలా కూడా అదనంగా సంపాదించి పిల్లల అవసరాలు తీర్చేవాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో అనుకోని కుదుపు ఏర్పడింది. అది వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేసింది. ఫలితంగా నలుగురు ఉండాల్సిన కుటుంబంలో ప్రస్తుతం ఒక్కరే మిగిలిపోయారు. మిగతా వారంతా జ్ఞాపకాలుగా గోడకు ఫోటోలలాగా వేలాడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నగరానికి చెందిన గంజి పద్మ (40), తన భర్త శివ (48), పిల్లలు వంశీ(17), మరో కుమారుడు (15) తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. పేద కుటుంబానికి చెందిన పద్మ, శివ చైతన్యపురిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శివ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, పద్మ ఓ సంస్థలో కార్మికురాలిగా పనిచేస్తోంది. వీరి పిల్లలు ఓ కాలేజీలో చదువుతున్నారు. శివ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి ఇటీవల అతడు కన్నుమూశాడు. శివ కన్ను మూయడంతో కుటుంబ భారం పద్మ మీద పడింది. దీనికి తోడు శివను ఆస్పత్రులలో చూపించేందుకు బయట అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పుల వాళ్లు డబ్బులు ఇవ్వమని పద్మను అడుగుతుండడంతో ఆమె ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతి తట్టుకోలేక కుమారుడు వంశీ కూడా వేసుకొని చనిపోయాడు. ఇలా ఒక్కరోజులోనే తల్లి, సోదరుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కొన్ని నెల క్రితం తండ్రి, ఒక్కరోజులోనే తల్లి, సోదరుడు చనిపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు.
పద్మ, వంశీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో చైతన్యపురి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను మార్చురీ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి సొంత రాష్ట్రానికి పంపించారు. శివ, పద్మది పేద కుటుంబమని.. ఉన్న ఊళ్లో అప్పులు కావడంతో వారు హైదరాబాద్ వచ్చారని, ఇక్కడ కూడా అవే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో వారి కుటుంబం చిన్నాభిన్నమైందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబం గడిచేందుకు చాలాచోట్ల అప్పులు తీసుకొచ్చారని, వాటిని తీర్చే మార్గం లేక పద్మ ఆత్మహత్య చేసుకుందని, తల్లి మృతిని తట్టుకోలేక పెద్ద కుమారుడు వంశీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఆ కాలనీవాసులు అంటున్నారు. ఇరుగుపొరుగు వారితో బాగుండేవారని.. ఏనాడూ గొడవలు పెట్టుకునే వారు కాదని స్థానికులు చెబుతున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటిదాకా ఆ అద్దె ఇంట్లో నలుగురు ఉండేవారు. అనారోగ్య కారణాలతో కుటుంబ పెద్ద, తల్లి, పెద్ద కుమారుడు హార్దిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడంతో.. చిన్న కుమారుడు ఒక్కడే మిగిలాడు. అతడు గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. అతడిని చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Unable to bear the death of the mother the son also died in chaithanyapuri hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com