Paris Olympics 2024 : విశ్వ క్రీడలు పారిస్ లో ఘనంగా మొదలయ్యాయి. సెన్ నది తీరంలో అట్టహాసంగా వేడుకలు జరిగాయి.. ప్రారంభ వేడుకలకు 3 లక్షల 20వేల మంది అభిమానులు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పరేడ్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ అభిమానులకు అభివాదం చేశారు. సెన్ నదిపై ప్రత్యేకంగా రూపొందించిన పడవలపై ప్రయాణిస్తూ.. జాతీయ జెండాలను ఊపుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.. ముందుగా ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతి చేతిలో పట్టుకొని రావడంతో ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. అతడు పడవలో ప్రయాణించి.. వర్చువల్ విధానంలో తాడు సహాయంతో వేదిక వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన గుర్రంపై రావడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది. ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్ లో ముందుగా గ్రీస్ ఆటగాళ్ల బృందం వచ్చింది. గ్రేస్ ఆటగాళ్లు వారి జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక మన దేశానికి సంబంధించి పరేడ్ లో స్టార్ షట్లర్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ సీనియర్ ఆటగాడు శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్స్ పాత్రను పోషించారు. పరేడ్లో 84వ దేశంగా భారత్ పాల్గొన్నది. సింధు, శరత్ త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని భారత బృందానికి నాయకత్వం వహించారు.. పీవీ సింధు, శరత్ జాతీయ జెండాలను పట్టుకొని నడుస్తూ ఉంటే.. మిగతా ఆటగాళ్లు వారిని అనుసరించారు. అయితే ఈ గౌరవం దక్కడం పట్ల సింధు హర్షం వ్యక్తం చేసింది. “ఇది చాలా గర్వంగా ఉంది. ఏ క్రీడాకారుల కైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది. ఈసారి నాకు దక్కింది. జాతీయ జెండాను పట్టుకొని ప్రపంచ వేదిక ముందు నడవడం గర్వంగా ఉంది. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోందని” పీవీ సింధు పేర్కొంది. శరత్ కమల్ కు ఇవి ఐదవ ఒలింపిక్స్ కాగా.. పీవీ సింధుకు ఇవి వరుసగా మూడవ ఒలింపిక్స్. బ్యాడ్మింటన్ లో పీవీ సింధు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు స్పోర్ట్స్ 18, 1 ఎస్డీ, 1 హెచ్ డీ చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.. జియో సినిమా యాప్ లోనూ ఈ వేడుకలు లైవ్ టెలికాస్ట్ అయ్యాయి. అయితే జియో సినిమా యాప్ లో ఒలింపిక్ క్రీడలను ఉచితంగా చూసే అవకాశం ఉంది. ఈసారి 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పోటీ పడనున్నారు . భారత నుంచి 117 మంది ఆటగాళ్లు విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. జూలై 27న ప్రారంభమైన విశ్వ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. అదేరోజు సాయంత్రం ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. బాక్సింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నిఖత్ జరీన్, షూటింగ్ భాగంలో ఈషా సింగ్, టేబుల్ టెన్నిస్ భాగంలో ఆకుల శ్రీజ, బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు, ఆర్చరీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బొమ్మదేవర ధీరజ్, అథ్లెటిక్ విభాగంలో ఎర్రాజు జ్యోతి, జ్యోతిక శ్రీ, బ్యాడ్మింటన్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి పాల్గొంటున్నారు. అయితే ధీరజ్, నికత్ జరీన్, సింధు, సాత్విక్ పతకాలు సాధిస్తారనే అంచనాలున్నాయి..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pv sindhu and sarath kamal will march with national flag in paris olympics 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com