CISF Constable Kulwinder
CISF Constable Kulwinder: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి కుల్విందర్ కౌర్ చేయి చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటన తర్వాత ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఆ అధికారిణిని కర్ణాటకకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంత అన్న విషయం పక్కన సోషల్ మీడియాలో పెడితే కొందరు కుల్విందర్ కౌర్‌కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు బాలీవుడ్ హీరోయిన్ కంగనాకు మద్దుతు ఇస్తున్నారు.
ఏం జరిగిందంటే..
కొన్ని వారాల క్రితం ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ మహిళా పోలీస్ అధికారి కుల్విందర్ కౌర్ సినీ నటిని చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన తర్వాత కంగనాకు మద్దతుగా సెలబ్రిటీలు, బీజేపీ నేతలు, అభిమానులు నిరసనలు తెలిపారు. కంగనా రైతులను కించపర్చినందుకే సీఐఎస్‌ఎఫ్ అధికారిణి చేయి చేసుకుందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కంగనా రనౌత్‌తో భద్రతా ఉల్లంఘన ఆరోపణపై సీఐఎస్‌ఎఫ్ అధికారిణి కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు.
తాజాగా ట్రాన్స్‌ఫర్ పోస్టు..
సస్పెన్షన్‌లో ఉన్న అధికారి కుల్వీందర్ కౌర్‌పై కేసు దర్యాప్తులో ఉంది. ఈ క్రమంలో ఆమె బదిలీ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. అంటే సస్పెన్షన్ ఎత్తివేశారని, ఆమె మళ్లీ విధుల్లో చేరిందని తెలుస్తోంది. ఆమెను చండీగఢ్ నుంచి బెంగళూరు విమానాశ్రయంకు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో పాటు కుల్విందర్ కౌర్ భర్తను కూడా ట్రాన్స్‌ఫర్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బదిలీ వార్తలను కుల్విందర్‌కౌర్ కొట్టిపారేసింది. తన సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు తెలిపింది.
మహిళా అధికారిపై విచారణ..
ఇదిలా ఉండగా ప్రస్తుతం కుల్విందర్ కౌర్‌పై అదనపు విచారణ జరుగుతోంది. ఈ విచారణ ముగిసే వరకు కుల్విందర్ కౌర్‌ను విధుల్లోకి తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలో ఆమె బదిలీ అయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. కంగనాపై చేయి చేసుకోవడం కారణంగానే ఈ వార్తకు ఇంత ప్రాధాన్యం దక్కింది. విచారణ తర్వాత సీఐఎస్‌ఎఫ్ అధికారి విధుల్లో చేరతారా లేదా అనేది తేలుతుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Cisf constable kulwinder kaur has been transferred to bangalore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com