US Presidential Election 2024: అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అభ్యర్థుల కొరత ఎదుర్కొంటోంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లిక్ డెలిగేట్స్ తమ తమ పార్టీల అభ్యర్థులను ఇప్పటికే ఎన్నుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకున్నారు. దీంతో రెండు పార్టీల అభ్యర్థులు నిధుల సేకరణ సమావేశాలు నిర్వహించారు. ముఖాముఖి డిబేట్లలోనూ పాల్గొన్నారు. అయితే అమెరికన్లు మాత్రం ఇరు పార్టీల అభ్యర్థులపై పెదవి విరుస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ విధానాలపై చాలా మంది అమెరికన్లు అనుకూలంగా ఉన్నారు. అయితే అభ్యర్థిగా బైడెన్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇక రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పాలనను ఇప్పటికే చూసిన అమెరికన్లు ఆయనను ఎన్నుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే ఇటీవల జరిగిన డిబేట్లలో బైడెన్ వెనుకబడడం, ట్రంప్ దూకుడుగా ప్రదర్శించడంతో అమెరికన్లు క్రమంగా రిపబ్లిక్ పార్టీవైపు మళ్లుతున్నారు. ఇదే సమయంలో బైడెన్ తీరు, ఆయన వైఫల్యాలతో డెమొక్రటిక్ పార్టీలో కూడా వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన ప్రచారం నుంచి ఐసోలేషన్‌కు వెళ్లారు. చికిత్స పొందుతూనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Also Read: కమల హారిస్ గెలవాలని.. తమిళనాడులోని ఆమె స్వగ్రామంలో ప్రత్యేక పూజలు
దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో తన వారసురాలిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి అమెరికావైపు మళ్లింది. బైడెన్ తర్వాత అధ్యక్ష రేసులోకి ఎవరు వస్తారని ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్‌పార్టీ డెలిగేట్లు తమ పార్టీ అభ్యర్తిగా ఎవరిని ఎన్నుకుంటారని చర్చించుకుంటున్నారు.
అధ్యక్ష అభ్యర్థికి గట్టి పోటీ..
కమలా హ్యారిస్‌కు అధ్యక్షుడు బైడెన్ మద్దతు తెలిపారు. కానీ, ఆమె సొంతపార్టీలోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మరి కొందరు కీలక నేతలు కూడా డెమొక్రటిక్ అభ్యర్థిత్వనాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రేసులో ప్రస్తుతం కమలా హారిస్ ముందు వరుసలో ఉన్నారు. కమలా హ్యారిస్ తర్వాత జేబీ.ప్రిట్జ్‌కర్ ప్రస్తుతం ఇల్లినాయీ గవర్నర్‌గా ఉన్నారు. అమెరికాలో అత్యంత ధనిక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా రాజ్యాంగ సవరణలకు మద్దతు ఇచ్చారు. ‘‘థింక్ బిగ్ అమెరికా’’ అనే నినాదంతో ప్రజల మద్దతు పెంచుకున్నారు. మరొకరు మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మెర్ కూడా పోటీ పడుతున్నారు. డెమొక్రటిక్ పార్టీలో వేగంగా ఎదిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు. డెమొక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన స్పీకర్‌గా ఉన్నారు.
ముగ్గురు మహిళా నేతలు కూడా..
ఇదిలా ఉంటే.. డెమొక్రటిక్ పార్టీలో అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హారిస్‌తోపాటు హిల్లరీ క్లింటన్ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో కమలా హ్యారిస్, హిల్లరీకి 50 శాతం పార్టీ డెలిగేట్లు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో మహిళా నేత మాజీ అధ్యక్షుడు మారక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా పేరు కూడా తెరపైకి వచ్చింది. ముగ్గురు మహిళల మధ్యే డెలిగేట్ సమావేశంలో పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరు అభ్యర్థిగా ఎన్నికైనా మహిళా నేతనే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ను ఎదుర్కొంటారు. ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు.
Also Read: అనుకున్నదే అయింది… అధ్యక్ష రేసు నుంచి తపుపకున్న బైడెన్.. భారత సంతతి మహిళకు ఛాన్స్!
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More