Homeక్రీడలుక్రికెట్‌Champions trophy 2025: పాక్ కు షాక్.. టీమిండియా ఆడే మ్యాచ్ ల విషయంలో ఐసీసీ...

Champions trophy 2025: పాక్ కు షాక్.. టీమిండియా ఆడే మ్యాచ్ ల విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం?

Champions trophy 2025 : ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తహతహలాడుతోంది. ఎలాగైనా సరే భారత జట్టును ఈ టోర్నీ లో ఆడించాలని అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తోంది. భారత జట్టు ఆడితేనే ఆ కాస్త డబ్బులు వస్తాయి కాబట్టి.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక తిప్పలు పడుతోంది. పలు అంతర్జాతీయ వేదికల మీద ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. ఇటీవలి ఐసీసీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని చర్చకు తీసుకొచ్చింది.. అయితే పాకిస్తాన్ చెప్పిన విషయాలు మొత్తం ఇప్పటివరకు సావధానంగా విన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పుడు తాజాగా అడ్డు చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్ లు మొత్తం లాహోర్ లో నిర్వహిస్తామని పిసిబి వెల్లడించిన నేపథ్యంలో.. ఐసీసీ దానికి నో చెప్పింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఐసీసీ తీసుకొన్న నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి ఏర్పడింది.

పాకిస్తాన్ దేశంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్ ట్రోఫీ కి టీమిండియా వెళ్తుందా? లేదా? అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం రాలేదు. భారత జట్టును పాకిస్తాన్ పంపే విషయంలో బీసీసీఐ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకారమే బీసీసీఐ భారత జట్టుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. వాస్తవానికి భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించక పుష్కరకాలం దాటింది. ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే పాల్గొంటున్నాయి. తటస్థ వేదికలలో ఆడుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ లకు ఎప్పుడో మంగళం పాడేశాయి. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ దేశం వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లభించలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. భారత జట్టును పాకిస్తాన్ పంపేందుకు బీసీసీఐ కి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే నిబంధనల ప్రకారం తమ దేశంలోనే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లు మొత్తం నిర్వహించాలని, హైబ్రిడ్ విధానంలో వద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుబడుతోంది. ఈ విషయాలపై ఐసీసీకి పదేపదే విజ్ఞప్తులు చేస్తోంది. ముఖ్యంగా భారత జట్టును పాకిస్తాన్ తీసుకువచ్చే బాధ్యతను పిసిబి ఐసీసీకి అప్పగించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీకి ఒక డ్రాఫ్ట్ అందించింది. ఇందులో భారత్ ఆడే మ్యాచ్ లు మొత్తం లాహోర్లో నిర్వహిస్తామని పేర్కొంది.. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందించిన డ్రాఫ్ట్ ను ఇతర దేశాల బోర్డుల ముందు ఉంచి.. వాటితో చర్చించి షెడ్యూల్ ఖరారు చేయాల్సిన బాధ్యత ఐసీసీ మీద ఉంటుంది. కేవలం డ్రాఫ్ట్ మాత్రమే కాకుండా టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిడియా ఆడే మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా పిసిబి స్పష్టత ఇచ్చింది.

అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఛాంపియన్ ట్రోఫీ కి సంబంధించి తాము ఆడే వేదికలను మార్చాలని బీసీసీఐ ఐసీసీ ని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అయ్యే ఖర్చును గతంలో కంటే అదనపు మొత్తాన్ని బడ్జెట్ లో కేటాయించినట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్ వెళ్ళకుంటే.. ఒకవేళ ఆ మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తే.. వాటి నిర్వహణ కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని ఐసీసీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు icc కి అందించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular