Okra Water: ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికి శ్రద్ధ పెరుగుతోంది. పలు రకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఎన్నో చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. పసుపు, దాల్చిన చెక్క, నిమ్మరసం, మెంతులు వంటి సుగంధ ద్రవ్యాలతో కషాయం చేసుకుని తాగుతూ దగ్గు, జలుబు వంటి వాటిని దూరం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాత్రి నానబెట్టిన రెండు బెండకాయల నీళ్లు ఉదయం పరగడుపున తాగుతున్నారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహానికి చాలా మంచిది. అందుకే బెండకాయ నీళ్ల తాగేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలను పొందే క్రమంలో బెండకాయ నీరు ఎంతో సురక్షితం కావడంతో దీన్ని అందరు ఆశ్రయిస్తున్నారు.
బెండకాయ నీటిలో పోషకాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఇందులో మెగ్నిషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉండటంతో బెండకాయ నీళ్లు దివ్య ఔషధంగా పనిచేస్తున్నాయి. దీంతో రోజు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. బెండకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇది ఆకలిని తగ్గించడానికి దోహదపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బెండకాయ నీరు శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచడానికి సాయపడుతుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే గుణం ఇందులో దాగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. భోజనం చేసిన తరువాత వచ్చే సమస్యలు, ఆకలి బాధలను తగ్గిస్తుంది. బెండకాయల్లో ప్లేవనాయిడ్లు లేదా యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండటంతో శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతో మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా దోహదపడతాయి. అందుకే బెండకాయ నీటితో పాటు వాటిని కూరల్లో చేర్చుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
బెండకాయ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తంలో చెడు కొవ్వును నియంత్రిస్తుంది. గుండె పనితీరు మెరుగుపడేందుకు సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఎఫెక్టివ్ గా చేయడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తం శుద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం కాంతి వంతంగా ఉంచేందుకు సాయపడుతుంది. చర్మంపై మచ్చలను దూరం చేస్తుంది. రోజు బెండకాయ నీరు తాగడంతో ఇన్ని రకాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున వీటి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.