Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తున్న యంగ్ హీరో…ఈసారైనా హిట్టు దక్కుతుందా..?

ఇక ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇక తమ్ముడు అన్న టైటిల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా ఆయన కెరియర్ లోనే ఒక మంచి హిట్ సినిమాగా నిలిచింది

  • Written By: NARESH
  • Published On:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తున్న యంగ్ హీరో…ఈసారైనా హిట్టు దక్కుతుందా..?

Follow us on

Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో యంగ్ హీరో అయిన నితిన్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ అనే సినిమా రిలీజ్ కి రెడీ అయింది.

ఇక ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్ లో పాల్గొన్న తను చేయబోయే తర్వాత సినిమాల మీద కూడా ఒక సరైన క్లారిటీ ఇచ్చాడు.తర్వాత ఆయన వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పటికే వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేసిన భీష్మ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా నితిన్ కి సరికొత్త బ్లాక్ బాస్టర్ హిట్టును కూడా అందించింది. ఇక ఈ క్రమంలోనే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే మరో సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక దీంతోపాటుగా ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలు చేసిన శ్రీరామ్ డైరెక్షన్ లో కూడా నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక అదే విషయం మీద నితిన్ స్పందిస్తూ ఇప్పటికే వేణు శ్రీరామ్ తనకోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా నితిన్ తెలియజేశాడు. అయితే వేణు శ్రీరామ్ ఇంతకుముందే ఐకాన్ అనే ఒక టైటిల్ తో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది అనివర్య కారణాల వల్ల ఆగిపోయింది.ఇక ఇప్పుడు ఆ స్టోరీ నే నితిన్ తో చేస్తున్నాడా..? అనే టాక్ అయితే బయట నడుస్తుంది. కానీ నితిన్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఈ స్టోరీ సెపరేట్ అని దానికి దీనికి సంబంధం లేదు అని తెలుస్తుంది.ఇక ఇది ఒక ఫ్రెష్ అన్నదమ్ముల కథగా రబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇక తమ్ముడు అన్న టైటిల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా ఆయన కెరియర్ లోనే ఒక మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఇక అదే టైటిల్ ని వాడుకుంటున్న నితిన్ కూడా ఈ సినిమాతో సరైన సక్సెస్ కొట్టాలనే ఆశ భావాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు… ఇక దీంతో వేణు శ్రీరామ్ చేసే సినిమా స్టోరీ ఫ్రెష్ స్టోరీ కావడంతో నెక్స్ట్ తను ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ తో కూడా ఐకాన్ అనే సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు