Rahul Dravid : రాహుల్ డ్రావిడ్ కు దారేది?

ఇక ఇప్పుడు ద్రావిడ్ తప్పుకుంటే మళ్ళీ ఇండియన్ టీమ్ కి కొత్త కోచ్ గా ఎవరస్తారు అనేది తెలియాల్సి ఉంది…

  • Written By: NARESH
  • Published On:
Rahul Dravid : రాహుల్ డ్రావిడ్ కు దారేది?

Follow us on

Rahul Dravid : ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నిర్ణయించడానికి ఒక గురువు అనేవారు తప్పకుండా ఉండాలి. మనం ఏం చేయాలనే దాని మీద మనకు క్లారిటీ ఉండదు ఎలా చేయాలనేది అసలు మనకు తోచదు. ఇలాంటి క్రమంలో క్రికెట్ లాంటి ఒక పెద్ద ఆటలో కోచ్ అనేవాడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. ప్లేయర్లు మ్యాచ్ ఎలా ఆడాలి, మ్యాచ్ ని ఎలా గెలిపించుకోవాలని అనేది ఆయన వివరిస్తూ ఉంటాడు…ఇక మ్యాచ్ ని ప్లేయర్లు ఆడి గెలిపించినప్పటికీ, ఒక మ్యాచ్ విజయం లో బ్యాకెండ్ నుంచి కోచ్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ప్లేయర్ గ్రౌండ్ లో ఎలా ఆడాలి, ఎవరి బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆడితే మనకు విజయం వరిస్తుంది అనే విషయాల పట్ల ప్లేయర్లు సలహాలను ఇస్తూ, ప్లేయర్లు డిప్రెషన్ లో ఉన్నా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మనం తప్పకుండా మ్యాచ్ లో గెలుస్తామనే ధైర్యాన్ని వాళ్ళలో నింపుతూ ముందుకు తీసుకెళ్లే వాడే కోచ్…

అయితే ఇండియన్ టీమ్ కి ఇంతకు ముందు చాలా మంది కోచ్ లు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఇండియన్ టీం ని టాప్ లెవల్లో నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు.ఇక ఇప్పుడు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా అదే తరహా కి ఇండియన్ టీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు అయితే రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల కిందట టి20 వరల్డ్ కప్ ముందు ఆయన కోచ్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు.ఇక టి20 వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ ఫెయిల్ అయింది. అయినప్పటికీ ద్రావిడ్ మాత్రం దృఢ సంకల్పంతో ఇండియన్ టీం ప్లేయర్ల పరిస్థితి కనుక్కుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఇండియన్ టీమ్ విజయాలు సాధించేలా చేస్తూ వస్తున్నాడు…

ఇంకా అందులో భాగంగానే రీసెంట్ గా వన్డే వరల్డ్ కప్ లో వరుస విజయాలను అందుకున్న ఇండియన్ టీం ఫైనల్ లో మాత్రం ఓడిపోయింది. రాహుల్ ద్రావిడ్ ఫైనల్ ల్లో ఇండియన్ టీం గెలుస్తుందని చాలా ఆశ భావాలను వ్యక్తం చేసినప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల ఇండియన్ టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. అయితే రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా ఇండియా గెలుచుకోలేదు. కానీ ద్వైపాక్షిక సిరీస్ ల్లో మాత్రం ఇండియా మంచి విజయాలను అందుకుంది.అయితే ఐసీసీ మ్యాచ్ ల్లో విజయం సాధించినప్పుడే ఆ టీమ్ కి కానీ ఆ కోచ్ కి కానీ ఎక్కువ గౌరవం హోదా దక్కుతాయి. కాబట్టి రాహుల్ ద్రావిడ్ ఇండియన్ టీం కి ఐసీసీ కప్పులు సాధించి పెట్టడం లో చాలావరకు ఫెయిల్ అయ్యాడు…

ఇకదానితో ఆయన కోచ్ గా తన పదవీకాలం కూడా ముగియడంతో తను ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే బిసిసిఐ తనని ఇంకో సంవత్సరం పాటు కోచ్ గా కొనసాగించిన తను కొనసాగుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక ప్రస్తుతము ఉన్న సిచువేషన్ లో ఇండియన్ టీం కి కోచ్ గా ఏ సీనియర్ ప్లేయర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇంకో వన్ ఇయర్ పాటు రాహుల్ ద్రావిడ్ నే కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నిర్ణయాన్ని రాహుల్ ద్రావిడ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

అయితే రాహుల్ ద్రావిడ్ ఇండియన్ టీం కప్పులు కొట్టడంలో ఫెయిల్ అయినప్పటికీ తన కోచింగ్ లో చాలామంది స్టార్ బ్యాట్స్ మెన్స్ వెలుగులోకి వచ్చారు ముఖ్యంగా రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ ,ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు వెలుగులో కి వచ్చారు…
అయితే ఈ యంగ్ ప్లేయర్లు అంతా ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లు కావడం విశేషం… అయితే తన సొంత ప్లేస్ అయిన బెంగళూరులో ఉంటూ ఎన్‌సీఏ బాధ్యతలు చూసుకుంటూ అండర్‌-19 కోచ్‌గా ఉంటూ యువ క్రికెటర్లను మేటి క్రికెటర్లు గా తీర్చి దిద్దాలనే ఆలోచన లోనే ద్రావిడ్ ఉన్నాడు. కానీ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టుబట్టి మరీ తనే ద్రావిడ్ ని టీమ్‌ఇండియా కోచ్‌ పదవిలోకి తీసుకొచ్చాడు. ఇక అప్పటికే ఇండియన్ టీమ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం ముగిశాక జట్టుకు ద్రవిడ్‌ అవసరం ఉంది అని గుర్తించిన గంగూలీ అతను కోచ్‌ గా బాధ్యతలు తీసుకునేలా చేశాడు. ద్రవిడ్‌ తనకి పూర్తిగా ఇష్టం లేకపోయిన కూడా గంగూలీ కోసమే తాను ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గా అవతారమెత్తాడు.

ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్‌ కావడంలో కీలక పాత్ర పోషించిన గంగూలీ ఇప్పుడు బోర్డులో లేడు. కాబట్టి ద్రావిడ్ కూడా కోచ్ గా తపుకునే అవకాశం అయితే ఉంది…అయితే ఒకప్పటి సీనియర్ ప్లేయర్లు అయిన సచిన్ గంగూలీ సెహ్వాగ్ లాంటి వాళ్ళు కోచ్ లు గా చేయడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా సంవత్సరాలు వాళ్ల ఫ్యామిలీ కి దూరంగా గడిపారు కాబట్టి ఇక ఇప్పుడైనా ఫ్యామిలీ తో గడపాలని చూస్తున్నారు అందుకే వాళ్ళు కోచ్ లు గా మారడానికి ఇష్టపడటం లేదు…ఇక ఇప్పుడు ద్రావిడ్ తప్పుకుంటే మళ్ళీ ఇండియన్ టీమ్ కి కొత్త కోచ్ గా ఎవరస్తారు అనేది తెలియాల్సి ఉంది…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు