India vs Zimbabwe: టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఐదు టి 20 మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో ముందంజలో ఉంది. మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో ఘనవిజయాలు సాధించింది. రెండవ టి20 లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించగా.. మూడవ టి20లో కెప్టెన్ గిల్ అర్ద సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో గెలిచి, సిరీస్ దక్కించుకోవాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టీమ్ ఇండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్పష్టం చేశాడు.. అయితే మూడో టి20 మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో దుమారానికి కారణమవుతున్నాయి.
మూడో టి20 మ్యాచ్లో జింబాబ్వే ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ సికిందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు.. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామని, ఫీల్డింగ్ చేసే సమయంలో తప్పులు చేశామని అంగీకరించాడు. ఫీల్డింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల 20 పరుగులను వదిలేసామని అంగీకరించాడు. పసలేని ఫీల్డింగ్ వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు..” మా టాప్ ఆర్డర్ లో అనేక సమస్యలు వెలుగు చూశాయి. వాటికి పరిష్కార మార్గం చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. మా ఫీల్డర్లు తప్పులు చేసినప్పటికీ వారికి అండగానే నేను ఉంటాను. మూడో మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో మేము ప్రదర్శన చేయలేదు. అందువల్ల అదనంగా 20 పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల మ్యాచ్ మా చేతిలో నుంచి జారేపోయింది.. ఇవి మా ఓటమికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.. ఇక ఇదే వేదికపై చాలాసార్లు మేము గెలిచాం. దురదృష్టం వల్ల ఓడిపోయాం.. మా ఆట తీరు పట్ల మేము సంతృప్తి గానే ఉన్నాం.. కుర్రాళ్ళు సత్తా చాటుతున్నారు.. సీనియర్లు తమ బాధ్యతను విస్మరించడం బాధ కలిగిస్తున్నది… ఈ సమస్య మాకు తీవ్ర ఇబ్బందులు కలగజేసింది. అలాగని దానిని పరిష్కరించుకునేందుకు మరో సమస్యను మేము సృష్టించుకోలేమని” రజా వ్యాఖ్యానించాడు..ఇక మూడవ టి20 మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన సికిందర్ రజా 24 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. 16 బాల్స్ లో 15 రన్స్ చేశాడు.
ఇక మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. తర్వాత మ్యాచ్లలో అద్భుతంగా పుంజుకుంది. రెండవ టి20 లో అభిషేక్ శర్మ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. మూడవ టి20లో గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. రెండో టి20 లో విఫలమైన కెప్టెన్ గిల్ మూడో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. గత కొద్దిరోజులుగా అతని ఆట తీరు పైన అనేక విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. విమర్శలు చేస్తున్న వారికి స్పష్టమైన సమాధానం చెప్పాడు.
ఇక ఐదు టి20 మ్యాచ్ల సీరీస్ లో టీమిండియా 2-1 తో ముందంజలో ఉంది. శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో గెలుపొంది సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆటగాళ్లు తీవ్ర కసరత్తు మొదలుపెట్టారు.. హరారే మైదానంపై మరింత పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు. ఇక మూడవ టి20 మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం తగ్గించుకున్న వాషింగ్టన్ సుందర్.. శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో గెలుపొంది.. సిరీస్ సొంతం చేసుకుంటామని వ్యాఖ్యానించాడు. మూడో టి20 మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ సికిందర్ రజా, క్యాంప్ బెల్ వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Sikandar raza comments on zimbabwe lost to team india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com