spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreemukhi: టాలెంట్ చూపించిన శ్రీముఖి అమ్మానాన్న, నెటిజెన్ సెటైర్... తిరిగి ఇచ్చి పడేసిన క్రేజీ ఫాదర్!...

Sreemukhi: టాలెంట్ చూపించిన శ్రీముఖి అమ్మానాన్న, నెటిజెన్ సెటైర్… తిరిగి ఇచ్చి పడేసిన క్రేజీ ఫాదర్! ఇంట్రెస్టింగ్ మేటర్

Sreemukhi: శ్రీముఖి బుల్లితెర పై టాప్ యాంకర్ గా రాణిస్తుంది. క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయింది. ఒక షో ముగిసిన వెంటనే మరో షో లో మెరుస్తుంది. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో శ్రీముఖి సందడి మామూలుగా లేదు. వరుసపెట్టి షోలు చేస్తూ హవా చూపిస్తుంది. యాంకర్ గానే కాదు నటిగా కూడా మెప్పిస్తుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఇక శ్రీముఖి ఎనర్జీ లెవెల్స్, అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన మాటల చాతుర్యంతో షోలలో జోష్ నింపేస్తుంది. శ్రీముఖి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తన తల్లి లత శ్రీ అంతకుమించి అని చెప్పాలి. లతా శ్రీ వృత్తిరీత్యా బ్యూటీషియన్. గతంలో పలు ఈవెంట్స్ లో లతా శ్రీ కనిపించారు. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాలో రీల్స్, డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. లతశ్రీ చేసే రీల్స్ కి సూపర్ క్రేజ్ ఉంది. నిత్యం రకరకాల గెటప్స్ లో రీల్స్ చేస్తూ షేర్ చేస్తుంది. అంతేకాదు తన భర్త రామ్ కిషన్ కూడా ఆమెతో జాయిన్ అవుతాడు. మొహమాటం లేకుండా పెర్ఫార్మన్స్ ఇస్తాడు.

తాజాగా వీరి రీల్స్ చూసిన ఓ నెటిజన్ సెటైర్ వేసింది. లతా శ్రీ ని ఉద్దేశిస్తూ ‘మిమ్మల్ని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది’ అంటూ కామెంట్ చేసింది. దానికి శ్రీముఖి తండ్రి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ కి శ్రీముఖి ఫాదర్ .. ‘ఆపేశావేం .. ఆ సామెత ఏంటో చెప్పు’ అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ఆ నెటిజన్ కవర్ చేయడానికి ట్రై చేసింది. మీరు మేడం గారు ఈ వయసులో ఉన్నప్పుడే ఇంత యాక్టివ్ గా ఉన్నారు.

ఇక శ్రీముఖి ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకెంత యాక్టీవ్ గా ఉండి ఉంటారో అంటున్నాను సార్. నేను శ్రీముఖి కి పెద్ద ఫ్యాన్ సార్. మీరన్నా… మేడం గారన్నా నాకు చాలా ఇష్టం అని కవర్ చేసింది. అయితే ఆమె కవర్ చేస్తున్న సంగతి అర్థం చేసుకున్న శ్రీముఖి ఫాదర్… మరో కౌంటర్ ఇచ్చారు. ‘ చెప్పండి .. చెప్పండి వినాలని ఉంది’ అంటూ ఆ లేడీ నెటిజన్ కి సెటైర్లు వేశారు శ్రీముఖి తండ్రి రామ్ కిషన్. అది కాస్తా వైరల్ గా మారింది.

శ్రీముఖి సక్సెస్ తో ఫ్యామిలీ గట్టిగా సెటిల్ అయ్యారు. స్టార్ యాంకర్ గా శ్రీముఖి సంపాదన ఏడాదికి కోట్లలోకి చేరింది. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ ఉంది. పేరెంట్స్, బ్రదర్ తో పాటు అక్కడే ఉంటుంది. ఇక శ్రీముఖి కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం. నటి కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. పటాస్ కామెడీ షోతో శ్రీముఖి వెలుగులోకి వచ్చింది. యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొంది. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్ట్ చేసిన శ్రీముఖి సత్తా చాటింది. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. శ్రీముఖి రన్నర్ అయ్యారు.

టైటిల్ కోల్పోయినా శ్రీముఖి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ రాబట్టిందని సమాచారం. షోల పరంగా తెలుగులో శ్రీముఖి నెంబర్ వన్. రష్మీ ఈటీవికి పరిమితం అయ్యింది. సుమ కనకాల టెలివిజన్ షోలు తగ్గించారు. అది శ్రీముఖికి కలిసొచ్చింది. ప్రస్తుతం శ్రీముఖికి పెద్దగా పోటీ లేదు. అందుకే ఆమె హవా నడుస్తుంది. మరోవైపు శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని శ్రీముఖి తేల్చి చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Ram Kishan (@ram.kishan.779857)

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper