Homeట్రెండింగ్ న్యూస్Viral Video: మల విసర్జనకని బయటకు వెళ్లాడు.. భారీ కొండ చిలువ చుట్టేసింది.. తర్వాతే అసలు...

Viral Video: మల విసర్జనకని బయటకు వెళ్లాడు.. భారీ కొండ చిలువ చుట్టేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్.. వీడియో*

Viral Video: పాము.. ఈ పేరు చెబితేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. ఇక పాము కనిపిస్తే.. అమ్మో అని ఆమడదూరం పరిగెడతాం. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. చిత్తడి, చెత్త చెదారం ఎక్కువగా ఉన్నప్రదేశాల్లో. ఎలుకలు ఉన్న ఇళ్లలోకి పాములు వస్తుంటాయి. మనం చూసుకోకుండా ఏమరుపాటుగా ఉంటే.. కాటేస్తాయి. ఇక పొలం గట్లపైనా, తోటలు, చేలల్లోనూ పాములు రైతులను భయపెడుతుంటాయి. ఇక ఇటీవల కొండ చిలువలు కూడా జనావాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో అడవుల్లో మాత్రమే కనిపించే ఈ సర్పాలు.. అడవులను నరికివేస్తుండడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇక వర్షాలు, వరదల కారణంగా కూడా కొండలు, గుట్టల నుంచి కొండ చిలువలు ఊళ్లలోకి కొట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పక్షులు, పశువులపై దాడులు చేస్తున్నాయి. థాయిలాండ్, వియత్నాం, భూటాన్‌ లాంటి దేశాల్లో కొండ చిలువలు మనుషులను చంపేస్తున్నాయి. కానీ, మన దేశంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా కల్యాణ్‌పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి బహిర్భూమికని సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా 15 అడుగుల కొండచిలువ అతడిపై దాడిచేసింది. తోకతో అతడి మెడను చుట్టేసి మింగేందుకు ప్రయత్నించింది. అయితే అతడు భయపడకుండా ధైర్యంగా కొండ చిలువ నోటిని గట్టిగా పట్టుకుని కేకలు వేయడం ప్రారంభించాడు. కొంతసేపటికి అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించారు. ఆ తర్వాత ఎలాగోలా అతడిని కాపాడారు. తాము వచ్చే సరికి కొండచిలువ గ్రామస్తుడిని మొత్తం చుట్టేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులు కూడా ధైర్యం చేసి దాని నుంచి బాధితుడిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయితే అది పట్టు విడవకపోవడంతో చివరకు గొడ్డళ్లు, రాళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో చంపేశారు.

పొంచి ఉన్న కొండచిలువ…
మన దేశంలో అడవుల్లో వన్యప్రాణులు తిరుగుతూనే ఉంటాయి. వర్షాకాలంలో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛగా భావిస్తాయి. ఈ క్రమంలోనే ఆహారం కోసం అడవిలో ఉన్న 15 అడుగుల కొండ చిలువ అడవిలో తిరుగతోంది. ఈ క్రమంలో జబల్‌పూర్‌ జిల్లా కల్యాణ్‌పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి బహిర్భూమి కోసం సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. అక్కడే నక్కి ఉన్న సర్పం గ్రామస్తుడు కనిపించగానే ఆహారం దొరికింది అన్నట్లుగా ఒక్కసారి అతడిపై దూకి… చుట్టేసుకుంది. చంపేందుకు బిగిస్తోంది. ఈ క్రమంలో అతడు భయపడకుండా ఉండడమే అతడి ప్రాణాలు కాపాడింది. కొండ చిలువ పట్టు బిగిస్తున్నా.. అతను తనను కాపాడుకోవడానికి కొండచిలువ తలను గట్టిగా పట్టుకున్నాడు. పెద్దగా కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు వెళ్లి భయానక దృశ్యాన్ని చూసి హడలిపోయారు. కొండ చిలువను విడిపించే అవకాశం లేకపోవడంతో చంపేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి సమాచారం సేకరించారు.

అవగాహన లేకపోవడంతో..
ఇదిలా ఉంటే.. గ్రామస్తులు కొండ చిలువను చంపడంపై వన్యప్రాణి సంరక్షణ సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, కొండ చిలువ నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియని కారణంగా.. అవగాహన లేకపోవడంతో దానిని పదునైన ఆయుధాలతో చంపేశారు. కొండచిలువపై అవగాహన ఉండిఉంటే.. దానిని చంపకుండానే వ్యక్తిని కాపాడేవారు. ఇదిలా ఉంటే.. కొండచిలువలు సాధారణంగా మనుషులపై దాడి చేయవని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. వాటిని సరిగ్గా నియంత్రించవచ్చని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల పట్ల అవగాహన లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ప్రాణాంతకంగా మారుతుందో కూడా ఈ సంఘటన స్పష్టం చేసింది. అటువంటి ప్రాంతాల్లో వన్యప్రాణులను సురక్షితంగా నిర్వహించడం గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మొత్తంమీద, ఈ సంఘటన గ్రామస్తులకు ఒక ముఖ్యమైన పాఠం.. వన్యప్రాణుల సంరక్షణ కోసం అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు, అటవీశాఖ కలిసి ఈ దిశగా కృషి చేయాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular