Rishikonda: రిషికొండను లాంగ్ లీజుకు ఇచ్చేశారా?

విశాఖ నగరంలో రిషికొండ ఒక ల్యాండ్ మార్క్. అయితే దానిని బోడి గుండు కొట్టించారు. టూరిజం ప్రాజెక్టు పేరుతో 500 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఇక్కడ టూరిజం ప్రాజెక్టులు మాత్రమే నిర్మించాల్సి ఉంది.

  • Written By: Dharma
  • Published On:
Rishikonda: రిషికొండను లాంగ్ లీజుకు ఇచ్చేశారా?

Follow us on

Rishikonda: రిషికొండపై నిర్మాణాలు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కాదా? అవి ప్రభుత్వ శాఖల కోసం నిర్మించినవి కావా? దీని వెనుక వేరే కథ ఉందా? అందుకే జగన్ సర్కార్ గోప్యత ప్రదర్శిస్తోందా? విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలను డైవర్షన్ లో పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. రిషికొండలో చారిత్రాత్మక ఆనవాళ్లను తొలగించి కొన్ని రకాల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని బయటకు వెల్లడించాలని విపక్షాలు కోరుతున్నా ఫలితం లేకపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఈ నిర్మాణాలకు రూ. 433 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు చూపించారు.

విశాఖ నగరంలో రిషికొండ ఒక ల్యాండ్ మార్క్. అయితే దానిని బోడి గుండు కొట్టించారు. టూరిజం ప్రాజెక్టు పేరుతో 500 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఇక్కడ టూరిజం ప్రాజెక్టులు మాత్రమే నిర్మించాల్సి ఉంది. అందుకే టూరిజం ప్రాజెక్టు పేరిట నిర్మాణాలను ప్రారంభించారు. కానీ అది ముమ్మాటికి సీఎం క్యాంప్ ఆఫీసు కోసమేనని వార్తలు వచ్చాయి. ఒకరిద్దరు మంత్రులు అయితే అందులో తప్పేంటి అని ప్రశ్నించారు.అయితే ఇది సీఎం క్యాంప్ ఆఫీసో.. ప్రభుత్వ శాఖల కార్యాలయాలో అక్కడ నిర్మించడం లేదు. అవన్నీ పర్యాటక ప్రాజెక్టుల మాటున అస్మదీయులకు లాంగ్ లీజుకే ఇచ్చేందుకేనని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక సమాచారం లీక్ అయ్యింది. రూ.433 కోట్ల ప్రజాధనం పెట్టి కట్టిన ప్యాలెస్ ను లీజుకు తీసుకునేందుకు ప్రముఖ హోటల్ నుంచి బిడ్ లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బయటకు ఒక వార్తను విడిచిపెట్టారు.అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి. కేవలం భవనాల నిర్వహణకు టెండర్లు పిలుస్తారని చెబుతున్నారు. కానీ అది నిర్వహణ కోసం కాదని.. పూర్తిగా లీజు పేరుతో అప్పగించేందుకేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 20 బెడ్ రూమ్ లు ఉన్నాయి. మరో 70 రూములు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మరిన్ని నిర్మాణాలు జరగనున్నాయి. అయితే ఆ మధ్యన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి రిషికొండలో పూజలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ప్రభుత్వ అధినేతగా చేశారా? లేకుంటే లాంగ్ లీజ్ కు తీసుకొని ప్రైవేటు వ్యక్తిగా పూజలు చేశారా అన్నది తెలియడం లేదు.

మొత్తం 33 ఏళ్లకు అగ్రిమెంట్ పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. అస్మదీయులకే లీజులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ అధికారం కోల్పోయిన రిషికొండపై అజమాయిషీ కొనసాగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీజుకు లో పైకారిగా చట్టబద్ధత కల్పించి.. అధికారం ఉన్నా, లేకపోయినా 33 సంవత్సరాలు పాటు ఎవరు ఖాళీ చేయించలేరని ఈ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద నిర్మాణానికి ఎంత ఎంత మొత్తానికి లీజు కేటాయించారు? లీజు దక్కించుకున్న సంస్థ ఏది? అన్నది మాత్రం బయటకు వెల్లడించడం లేదు. గతంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నదానిపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలు అయ్యింది. దీంతో ఖర్చు వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ లాంగ్ లీజ్ పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఏ తరహా చర్యలు ఉంటాయో చూడాలి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు