Balakishan Rasamayi: రసమయి నోటిదురుసు.. ఏకంగా కేసీఆర్‌పై బుతుపురాణం!

మానకొండూర్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభా వేదికపై కేసీఆర్‌ను దేవుడితో పోల్చాడు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌.

  • Written By: Raj Shekar
  • Published On:
Balakishan Rasamayi: రసమయి నోటిదురుసు.. ఏకంగా కేసీఆర్‌పై బుతుపురాణం!

Follow us on

Balakishan Rasamayi: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, బీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నారు. రసమయికి మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువే. దళితుడు కావడంతో ఎవరిని ఏమన్నా చెల్లుతుందనే భావనతో మాట్లాడుతుంటారు రసమయి. గతంలో సొంతపార్టీ ప్రజాప్రతినిధులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దొరికిపోయారు. తర్వాత క్షమాపణ చెప్పడం బాలకిషన్‌కు అలవాటే. అయితే ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు.. ఈసారి ఏకంగా తన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునే దుర్భాషలాడారు. ప్రజా ఆశీర్వాదర సభలో దేవుడు అని పొడిగిన రసమయి అదే నోటితో సీఎంను వాడు, వీడు.. పీకిచ్చిండా లాంటి పదాలు వాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఓ వాయిస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మూడు రోజుల క్రితమే సభ..
మానకొండూర్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభా వేదికపై కేసీఆర్‌ను దేవుడితో పోల్చాడు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌. అయితే ఒక్కరోజులోనే గాడు వాడు అనే స్థాయిలో ఆయన భాష మారిపోయింది. అంటే బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎం జరుగుతుందో ఆలోచించాలి. అసలు విషయానికొస్తే కళాకారుడు అంతడుపుల నాగరాజు కి సంబంధించిన డబ్బుల విషయంలో రసమయి కి దరువు ఎల్లన్న ఫోన్‌ చేశాడు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ‘నేను ఏమైనా కోట్లకు ఉన్నోడినా కేసీఆర్‌ గాడేమైనా నాకు పీకిచ్చిండా.’ అంటూ రెచ్చిపోయాడు. తెలంగాణ కోసం చంద్రబాబు, వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి గాళ్లను తిడుతూ పాటలు పాడి, కోట్లాడినటువంటి వాళ్లం. కేసీఆర్‌ గాడు మెడలు వట్టుకుని బయటకు వెల్లగొడితే, అయిన అడుగు అని అడిగితే, వీనికోసం నేను అడగాల కేసీఆర్‌ గాన్ని డబ్బులు’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడిన ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

గతంలో పలువురిపై..
గతంలో అనేక మంది కళాకారులు, సొంత పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కూడా రసమయి దుర్భాషలాడారు. తర్వాత క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కరీంపేట సర్పంచ్‌ మల్లయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేశారు సర్పంచ్‌ మల్లయ్య. తనకు మద్దతుగా వచ్చిన తిమ్మాపూర్‌ మండలం మొగలిపాలెం మాజీ సర్పంచ్‌పై పోలీసులతో దాడి చేయించారని మల్లయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకిషన్‌ దౌర్జన్యాలు, వేధింపులు భరించలేక టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

తాజాగా కేసీఆర్‌నే వాడు.. వీడు అంటూ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయం గులాబీ బాస్‌ దృష్టికి వెళ్లిందా..వెళితే ఎలాంటి చర్యలు ఉంటాయి అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

 

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు