Revanth Reddy: తెలంగాణలో బొటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు. కానీ, ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నామని మర్చిపోతున్నారు.
ఓడినవారిపై ప్రభావం..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీచేసి ఓడి పోయినవారిపై ప్రభావం పడుతోంది. ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు. దీంతో గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి, కొత్తగా పార్టీలోకి చేరిన వారి మధ్య పోటీ నెలకొంటుంది. నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడతారు. ఇది పాత కొత్త నేతల మధ్య వైరానికి దారితీయడం ఖాయం
Also Read: Mahalakshmi Scheme : మహిళలకు షాక్.. రూ.2,500 పథకం వీరికి మాత్రమే..
నైతికత తిలోదకాలు..
అధికార పార్టీలో చేరుతున్నవారు.. చేర్చుకుంటున్నవారు ఇద్దరూ నైతికతకు తిలోదకాలు ఇస్తున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు ఆ పదానికే స్థానం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరినవారితో ప్రభుత్వం స్థిర పడొచ్చు. కానీ, పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వం పడిపోతుంది.. కూలుస్తాం అన్న నేతలు కూడా ఇప్పుడు అధికార పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరని కాంగ్రెస్ పార్టీనేతలు గొప్పగా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. కానీ, కేసీఆర్ అనుచరులను చేర్చుకోవడం ద్వారా ముప్పు తెచ్చుకుంటున్నామన్న విషయం మర్చిపోతున్నారు.
Also Read: Revanth Reddy : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం..
అధికారం కోసమే..
చేరికలను కాంగ్రెస్ గొప్పగా అనుకుంటోంది. కానీ అది కాంగ్రెస్ గొప్ప కాదు.. అధికారం గొప్ప అన్న విషయం విస్మరిస్తోంది. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా చేరలేదు. ఇప్పుడు చేరుతున్నారంటే అది అధికారం గొప్పదనమే. ఇప్పుడు చేరిన వారు, చేరుతున్న వారు కూడా అధికారం అనుభవించడానికే. ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటారు. లేదంటే మళ్లీ వారు కేసీఆర్ పంచనో.. ఇంకో పార్టీలో కేరడం ఖాయం. ఇలాంటి చేరికతలో బీఆర్‌ఎస్ ఇప్పుడు బాగా నష్టపోవచ్చు.. కానీ రేపు కాంగ్రెస్‌కు కూడా ఇదే పరిస్థితి రావొచ్చు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Revanth reddy is doing the same mistake kcr did
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com