Akshay Kumar : 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు.. అక్షయ్ గిన్నిస్ రికార్డ్.. ఎలా సాధ్యమైందంటే?

Akshay Kumar breaks Guinness World Record : సినిమాలు ప్రమోషన్ చేసుకోవడం ఒక ఆర్ట్. ఇందులో మన దర్శక ధీరుడు రాజమౌళిని మించిన మార్కెటింగ్ నిపుణులు లేరంటారు. ఈ మధ్య విడుదలైన ‘పఠాన్’కు పెద్దగా షారుఖ్ ఖాన్ ప్రచారం చేసుకోలేదు. అయినా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి హిట్అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం ప్రమోషన్ల కోసం వినూత్న బాటపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కూడా అదే చేశాడు. తన తదుపరి చిత్రం ‘సెల్ఫీ’ […]

  • Written By: NARESH
  • Published On:
Akshay Kumar : 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు.. అక్షయ్ గిన్నిస్ రికార్డ్.. ఎలా సాధ్యమైందంటే?

Follow us on

Akshay Kumar breaks Guinness World Record : సినిమాలు ప్రమోషన్ చేసుకోవడం ఒక ఆర్ట్. ఇందులో మన దర్శక ధీరుడు రాజమౌళిని మించిన మార్కెటింగ్ నిపుణులు లేరంటారు. ఈ మధ్య విడుదలైన ‘పఠాన్’కు పెద్దగా షారుఖ్ ఖాన్ ప్రచారం చేసుకోలేదు. అయినా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి హిట్అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం ప్రమోషన్ల కోసం వినూత్న బాటపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కూడా అదే చేశాడు. తన తదుపరి చిత్రం ‘సెల్ఫీ’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అక్షయ్ కుమార్‌ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పుడు అక్షయ్ ను సెల్ఫీ కింగ్ అని పిలవవచ్చు, ఎందుకంటే అతను కేవలం మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీలు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

బుధవారం సెల్ఫీ సినిమా ప్రమోషన్ల సందర్భంగా అక్షయ్ తన అభిమానులతో కేవలం మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలను తీశాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. మధ్యలో ఒకే స్థానంలో నిలబడి తన అభిమానులతో నిరంతరం సెల్ఫీలు తీసుకొని ఈ రికార్డు సృష్టించాడు.

అనంతరం గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. తన అభిమానులకు ఈ అవార్డ్ అంకితం ఇస్తున్నానని తన నోట్‌లో వెల్లడించాడు. “నా కెరీర్‌లో వారు నాకు ఎలా అండగా నిలిచారో తెలియజేస్తూ వారికి ఇది అంకితం” అని పేర్కొన్నాడు.“నేను సాధించిన ప్రతిదానికి.. నేను జీవితంలో ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల ఎనలేని ప్రేమ వల్లనే. నా కెరీర్‌లో వారు నాకు ఎలా అండగా నిలిచారో తెలియజేస్తూ ఇది వారికి డెడికేట్ చేస్తున్నాను. నా అభిమానుల సహాయంతో. , 3 నిమిషాల్లో అత్యధిక సెల్ఫీలు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ని బద్దలు కొట్టాను. అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా ప్రత్యేకమైనది. నేను దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ అందరినీ కలుద్దాం శుక్రవారం సినిమా థియేటర్లు’ అంటూ అక్షయ్ పోస్ట్ చేశాడు.

2015లో లండన్‌లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ షోలో మూడు నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసిన డ్వేన్ జాన్సన్ రికార్డును అక్షయ్ కుమార్ బద్దలు కొట్టాడు. అక్షయ్ కుమార్ రాబోయే చిత్రం సెల్ఫీ కోసం ఈ అరుదైన ఫీట్ చేశాడు. ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం 2019లో విడుదలైన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కి అధికారిక రీమేక్. హిందీ వెర్షన్ ఫిబ్రవరి 24, 2023న థియేటర్లలోకి రానుంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు