Bollywood: బాలీవుడ్ కి 2023 గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. అప్పటి వరకు వరస్ట్ ఫేజ్ బాలీవుడ్ చూసింది. హిందీ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కరోనా తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులు రాకపోవడంతో ఓటీటీదే హవా అనుకున్నారు. అదే సమయంలో సౌత్ సినిమాలైన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, కాంతారా నార్త్ లో ఆడాయి. బాలీవుడ్ బడా స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్… ప్రతి స్టార్ కి డిజాస్టర్స్ పడ్డాయి.
అయితే 2023లో హిందీ పరిశ్రమకు షారుఖ్ ఖాన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఏళ్లుగా ఫార్మ్ కోల్పోయి బాధపడుతున్న షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ చేసింది. షారుక్ ఖాన్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు విడుదల చేశాడు. జవాన్ సైతం మరో రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. యానిమల్ రూ. 900 కోట్లు, గదర్ 2 దాదాపు రూ. 700 కోట్లు వసూలు చేసింది.
2023 బాలీవుడ్ మేకర్స్ భారీగా లాభపడ్డారు. అయితే 2024 అంత ఆశాజనకంగా లేదు. అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ ల మల్టీస్టారర్ బడే మియా చోటే మియా ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. రంజాన్ కానుకగా బడే మియా చోటే మియా ఏప్రిల్ 11న విడుదలైంది. బడే మియా చోటే మియా జనాల్లో హైప్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రచారం కూడా అంతంత మాత్రమే. దానికి తోడు పూర్ రివ్యూస్ వసూళ్లను దెబ్బతీశాయి.
బడే మియా చోటే మియా చిత్ర బడ్జెట్ దాదాపు రూ 350 కోట్లు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్స్ రూ. 50 కోట్లు కూడా దాటవు అంటున్నారు. బాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా బడే మియా చోటే మియా రికార్డులు ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్ర దర్శకుడు. పృథ్విరాజ్ సుకుమారన్, మానుషీ చిల్లర్ కీలక రోల్స్ చేశారు. మరి లాంగ్ వీకెండ్ ఉండగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటుందో లేదో చూడాలి…
Web Title: Bade miyan chote miyan movie biggest disaster in indian history
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com