కూతురు షర్మిల కోసం విజయమ్మ ఎమోషనల్

తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈరోజు పార్టీని ప్రకటించారు. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ రావడం విశేషం. తన కూతురు పార్టీ పెట్టిన సందర్భంగా తొలి ప్రసంగాన్ని విజయమ్మ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ‘వైఎస్ఆర్ తెలంగాణపార్టీని’ హైదరాబాద్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ , షర్మిల పూలమాలలు […]

  • Written By: NARESH
  • Published On:
కూతురు షర్మిల కోసం విజయమ్మ ఎమోషనల్

Follow us on

తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈరోజు పార్టీని ప్రకటించారు. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ రావడం విశేషం. తన కూతురు పార్టీ పెట్టిన సందర్భంగా తొలి ప్రసంగాన్ని విజయమ్మ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ ఎమోషనల్ అయ్యారు.

‘వైఎస్ఆర్ తెలంగాణపార్టీని’ హైదరాబాద్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ , షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం విజయమ్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘శత్రువైనా.. ప్రత్యర్థులైనా సరే వైఎస్ఆర్ ను అభిమానించారని.. నాయకుడంటే వైఎస్ఆర్ లా ఉండాలన్నారని.. ఆయన మరణం లేని నాయకుడు’ అని భర్తను విజయమ్మ గుర్తు చేసుకున్నారు.

తెలంగాణలో వైఎస్ఆర్ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని.. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కల అసంపూర్తిగా ఉందని.. దాన్ని నెరవేర్చేందుకు వస్తున్న షర్మిలను ఆశీర్వదించాలని కోరారు.

వైఎస్ ఆత్మీయత హావభావాలను జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని.. ఇద్దరూ వేర్వేరు రాస్ట్రాలు, పార్టీలకు ప్రతినిధులన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయని అన్నారు. షర్మిల తోడుగా ఉంటుందని అక్కున చేర్చుకోవాలని విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు