Samantha- Naga Chaitanya: సమంత-నాగచైతన్య విడాకులకు అసలు నిజం తెలిసింది.. షాకింగ్

నాగచైతన్య అభిమానులు తప్పు అంతా సమంతదే అని అనగా.. సమంతా అభిమానులు తప్పు మొత్తం నాగచైతన్యడి అని నిందించుకుంటూ వచ్చారు. అయితే ఎవరు పడిన బాధ వాళ్లకే తెలుస్తుంది అన్నట్టు వాళ్ల విడాకులకు కారణం వారిద్దరికే తెలియాలి.

  • Written By: Swathi
  • Published On:
Samantha- Naga Chaitanya: సమంత-నాగచైతన్య విడాకులకు అసలు నిజం తెలిసింది.. షాకింగ్

Follow us on

Samantha- Naga Chaitanya: సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో రోజులు అవుతున్న కాని వీరు విడాకులు తీసుకున్న కారణం పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఎందుకు అంటే ఏం మాయ చేసావే సినిమా విడుదలైన దగ్గర నుంచి తెలుగు ప్రేక్షకుల మదిలో ఈ జంట చెరగని ముద్ర వేసింది. ఇక అలాంటి ఆన్ స్క్రీన్ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా పెళ్లి చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కాగా అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో వీరిద్దరూ విడాకులు ప్రకటించి అందరిని షాక్ కి గురి చేశారు. ఇక అప్పటి నుంచి ఇలాంటి చూడ చక్కని జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు అని ఎవరికి వారు ఆరా తీస్తూ వచ్చారు.

నాగచైతన్య అభిమానులు తప్పు అంతా సమంతదే అని అనగా.. సమంతా అభిమానులు తప్పు మొత్తం నాగచైతన్యడి అని నిందించుకుంటూ వచ్చారు. అయితే ఎవరు పడిన బాధ వాళ్లకే తెలుస్తుంది అన్నట్టు వాళ్ల విడాకులకు కారణం వారిద్దరికే తెలియాలి. కానీ ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం వీరి విడాకుల కారణాలు చెప్పకనే చెబుతున్నాయి. అంతే కాదు తప్పు సమంతా కన్నా కూడా నాగచైతన్యది ఎక్కువ ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది.

ముఖ్యంగా నాగచైతన్య ..శోభిత ధూళిపాల తో ప్రేమలో ఉన్నారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి ఫారిన్ లో ఉన్న ఒక ఫోటో అలానే వీరిద్దరూ ఒకే పుస్తకం చదువుతూ ఉన్న రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అప్పట్లో సమంత విడాకులు తీసుకున్నప్పుడు సమంత ఫ్రెండ్ అయినా ఒక ఫ్యాషన్ డిజైనర్..’ మొత్తానికి నువ్వు అనుకుంది సాధించావు .. బిచ్ ‘ అంటూ ఒక స్టేటస్ షేర్ చేశారు. అంటే నాగచైతన్య కి వేరే అమ్మాయితో సంబంధం ఉన్నట్టు.. అమ్మాయి ఫైనల్ గా అనుకుంది సాధించి సమంతకు ద్రోహం చేసినట్టు ఇన్ డైరెక్ట అర్థం వచ్చేటట్టు షేర్ చేశాడు ఆయన. కానీ అప్పుడు నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం చైతు అలాంటివాడు కాదు అని ఆ పోస్టును కొట్టి పరేశారు. అయితే అది జరిగిన కొద్ది రోజులకే నాగచైతన్య, శోభిత రూమర్ బయటకు వచ్చింది.

ఇక విడాకులు తీసుకున్న దగ్గర నుంచి చాలామంది సమంత పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేయడం.. ఎక్స్పోజింగ్ చెయ్యడం వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటూ చెబుతూ వచ్చాడు. కానీ అందులో ఏమాత్రం నిజం ఉండకపోవచ్చు.‌ ఎందుకంటే పెళ్లయిన తర్వాత దాదాపు వీరిద్దరూ విడాకులు తీసుకుందాం అనే నిర్ణయం తీసుకునే ముందు వరకు సమంత మరీ అతిగా అయితే ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయలేదు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారు అనే వార్తలు వచ్చిన దగ్గరనుంచి కొన్ని బౌల్ద్ క్యారెక్టర్స్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు సమంత హీరోయిన్ అని తెలిసే నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తుందని తెలిసే చైతు పెళ్లి చేసుకున్నారు. మరి సినిమాలో క్యారెక్టర్స్ ప్రాబ్లం అయ్యుంటే అసలు చైతు.. సమంత.. ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఉండేది కాదు.

అంతేకాకుండా ప్రస్తుతం శోభిత బాలీవుడ్ వెబ్ సిరీస్ లో విపరీతమైన ఎక్స్పోజింగ్ అలానే బోల్డ్ సీన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి నిజంగా చైతుకి బోల్డ్ క్యారెక్టర్స్ అలానే ఎక్స్పోజింగ్ సమంత విషయంల్లో ప్రాబ్లం అయి ఉంటే ఇప్పుడు శోభిత విషయంలో మాత్రం అది ఎందుకు కనిపియడం లేదు అని సమంత అభిమానులు సోషల్ మీడియా వేడుకగా ప్రశ్నిస్తున్నారు.
సమంతా విషయంలో తప్పు అయినది ..శోభిత విషయంలో మాత్రం అక్కినేని వారికి కరెక్ట్ ఎలా అవుతుంది.. అసలు ఏంటి చైతు ఇదంతా అనేది ప్రస్తుతం చాలామంది మైండ్లో రన్ అవుతున్న ప్రశ్న.

మరి ఇలాంటి సమయంలో చైతు.. శోబితతో రిలేషన్ షిప్ అఫీషియల్ గా ప్రకటిస్తే మాత్రం ఈ విషయం పైన పెద్ద చర్చే కొనసాగనుంది. అంతేకాదు అది అఫీషియల్ గా బయట వచ్చిన రోజు సమంత అభిమానులు చైతు అభిమానుల పైన విరుచుకు పడడం ఖాయం. ఎందుకు అంతే విడాకుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో సమంత పైన నెగటివ్ పోస్టులు.. ట్రోల్ల్స్ విపరీతంగా వచ్చాయి. ఇక అందుకే ఎప్పుడెప్పుడు తమ పగని తీర్చుకుండమా అని ఎదురు చూస్తున్నారు సమంత అభిమానులు.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు