Sourav Ganguly – Rohit : అలా బెదిరించి మరీ రోహిత్ ని కెప్టెన్ చేశాం: గంగూలీ

2023 ప్రపంచకప్‌లో రోహిత్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ పోటీలో ఇప్పటివరకు 8 లీగ్-స్టేజ్ మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా మాత్రమే ఓటమి ఎరుగని జట్టు. నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ గేమ్ షెడ్యూల్‌ లోనూ భారత్‌ ఈజీగా గెలవడం ఖాయం.

  • Written By: NARESH
  • Published On:
Sourav Ganguly – Rohit : అలా బెదిరించి మరీ రోహిత్ ని కెప్టెన్ చేశాం: గంగూలీ

Follow us on

Sourav Ganguly – Rohit : రోహిత్ శర్మ.. భారత క్రికెట్ లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచారు. ఐపీఎల్ లో ఏకంగా ఐదు కప్ లను ముంబైకి అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండు సార్లు ఆసియా కప్ గెలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఏకంగా వరుసగా 8 మ్యాచ్ లు గెలిచి దూసుకెళుతోంది. అంతర్జాతీయ క్రికెట్ లో మొదటి 100 మ్యాచ్ లు ఆడిన కెప్టెన్ల లిస్ట్ తీస్తే రోహిత్ 74 శాతం విజయాలతో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నారు. అయితే నిజానికి కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే తనకు వద్దని రోహిత్ శర్మ చెప్పారని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పు కథ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా మిగిలిపోయింది. కెప్టెన్ గా.. తన ఆటతో మూడు ఫార్మాట్లలో వెలుగు వెలిగిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే అతడి సారథ్యంలో ఒక్క కప్పు కూడా టీమిండియా గెలుచుకోలేదు. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బలవంతంగానే పక్కకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోహ్లీని కెప్టెన్ గా తీసివేసే సమయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. కోహ్లీ నిష్క్రమించడానికి ముందు తెర వెనుక ఏమి జరిగిందో ఇప్పటికీ తెలియదు. కోహ్లీ నుండి కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుండి తన కెప్టెన్ పాత్రలో అద్భుతాలు చేశాడు. అయితే రోహిత్ ఈ కెప్టెన్సీ స్వీకరించడానికి ఆసక్తిగా లేడని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి కారణం గంగూలీనే అని విమర్శలు వచ్చాయి. కోహ్లీ సైతం గంగూలీపై విమర్శలు గుప్పించారు. దీంతో నాడు ఏం జరిగిందన్న దానిపై అసలు నిజాలు బయటపెట్టాడు గంగూలీ.

కోల్‌కతా టీవీతో చాట్‌లో గంగూలీ పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘’రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఆసక్తి చూపలేదు. మూడు ఫార్మాట్లలో ఆడటంలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని అతడి ఆలోచన.. ఒక దశలో నేను రోహిత్ ను కెప్టెన్సీ చేయమని అడిగా.. లేదంటే నేను బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పా.. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాను నడిపించడానికి రోహిత్ శర్మనే తగిన వ్యక్తి. అయితే ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం రోహిత్ టీంను నడిపిస్తున్న టీరు అద్భుతం.. ఫలితాలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు’ అంటూ విరాట్ కోహ్లి నిష్క్రమించిన తర్వాత భారత్‌కు నాయకత్వం వహించేందుకు అతనే అత్యుత్తమ వ్యక్తి’ అని దాదా గంగూలీ వెల్లడించాడు.

భారత కెప్టెన్సీని తీసుకోవడానికి రోహిత్ ఎందుకు ఆసక్తి చూపడం లేదని అడిగినప్పుడు, దిగ్గజ క్రికెటర్ అతనికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, అది పనిభారం వల్ల కావచ్చునని చెప్పాడు. “సరిగ్గా తెలియదు. చాలా క్రికెట్. పురుషుల క్రికెట్, టీ20 క్రికెట్, టెస్ట్ క్రికెట్ చాలా ఒత్తిడి. ఐపీఎల్ కెప్టెన్సీ కాబట్టి అతను తన పనిభారంపై అలా అని ఉండొచ్చు. కానీ భారత కెప్టెన్ పదవి కంటే ఏదీ మెరుగ్గా ఉండదు. తను తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. అతను బాగా రాణిస్తున్నాడు’ అని గంగూలీ అన్నాడు.

2023 ప్రపంచకప్‌లో రోహిత్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ పోటీలో ఇప్పటివరకు 8 లీగ్-స్టేజ్ మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా మాత్రమే ఓటమి ఎరుగని జట్టు. నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ గేమ్ షెడ్యూల్‌ లోనూ భారత్‌ ఈజీగా గెలవడం ఖాయం. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు సెమీ-ఫైనల్ మరియు ఫైనల్ లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా ఇదే ఫామ్ ను కనబరుస్తుందా? అన్నది అతడికి నిజమైన పరీక్ష లాంటిది. బుధవారం సెమీస్ లో ముంబైలో న్యూజిలాండ్ ను టీమిండియా ఎదుర్కోబోతోంది. ఇది రోహిత్ కు అసలు సిసలు పరీక్షగా చెప్పొచ్చు.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు