Sidhu Jonnalagadda : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ.. శర్వానంద్ తో సమానంగా తీసుకుంటున్నాడుగా!

ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం సినిమాలకే శర్వా రేంజ్ ను అందుకున్నాడు టిల్లు భాయ్. రీసెంట్ గా వచ్చి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం గ్రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

  • Written By: NARESH
  • Published On:
Sidhu Jonnalagadda : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ.. శర్వానంద్ తో సమానంగా తీసుకుంటున్నాడుగా!

Follow us on

Sidhu Jonnalagadda : అనుకోని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి, ఆయన సినిమా, మాటలు, బాడీ లాంగ్వేజ్ కోసం అభిమానులు ఎదురుచూసేలా చేసుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈయన సినిమా ఎప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న వారిలో సిద్దూ జొన్నలగడ్డ ఒకరు. ఇప్పుడు అమ్మాయిల రాకుమారుడు ఈ హీరో..

అయితే ఈ మాస్ హీరో గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా లాంటి సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు రచయితగా కూడా మంచి పేరు సంపాదించారు ఈ హీరో. ఇదిలా ఉంటే రీసెంట్ గా డీజే టిల్లు సినిమా తో ప్రేక్షకులను పలకరించిన టిల్లు వారి మదిలో నిలిచిపోయాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అసలు ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు.

డీజే టిల్లు కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే డీజే టిల్లు స్కైర్ కోసం బిజీ బిజీ అయ్యాడు సిద్ధూ. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుందని టాక్. ఇక బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించిన టిల్లు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడట. ఏకంగా రూ. 10కోట్లకు చేరిపోయింది సిద్ధూ రెమ్యూనరేషన్. ఈయన చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా పది కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశారట టిల్లూ. అంతే కాదు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా భారీగా రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉంది.

రెండు సినిమాలు కూడా హిట్ అయితే ఇక సిద్ధూకు తిరుగులేదనే చెప్పాలి. అవలీలగా స్టార్ గా ఎదిగిపోవడం, అవకాశాలు క్యూ కట్టడం జరుగుతుంది. ఇక హీరో శర్వానంద్ కూడా పది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం సినిమాలకే శర్వా రేంజ్ ను అందుకున్నాడు టిల్లు భాయ్. రీసెంట్ గా వచ్చి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం గ్రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు