Tollywood Couple : వరుణ్-లావణ్య లాగానే నెక్ట్స్ పెళ్లి చేసుకునే టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ ఎవరో తెలుసా?

కాగా లావణ్య, వరుణ్ బాటలో మరో జంట నడుస్తున్నారట. టాలీవుడ్ యంగ్ హీరో మలయాళీ క్రేజీ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారట.

  • Written By: NARESH
  • Published On:
Tollywood Couple : వరుణ్-లావణ్య లాగానే నెక్ట్స్ పెళ్లి చేసుకునే టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ ఎవరో తెలుసా?

Follow us on

Tollywood Couple : ఇటీవల ఓ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కారు. మెగా హీరో వరుణ్ తేజ్ తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేశారు. నవంబర్ 1న ఇటలీ దేశంలో లావణ్య-వరుణ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. కొణిదెల, అల్లు, కామినేని ఫ్యామిలీస్ తో పాటు లావణ్య కుటుంబ సభ్యులు పెళ్ళిలో సందడి చేశారు. వివాహం అనంతరం చిత్ర ప్రముఖులను ఆహ్వానిస్తూ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న హైదరాబాద్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు చిత్ర పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది.

కాగా లావణ్య, వరుణ్ బాటలో మరో జంట నడుస్తున్నారట. టాలీవుడ్ యంగ్ హీరో మలయాళీ క్రేజీ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారట. నెక్స్ట్ పరిశ్రమలో వీరి పెళ్లి హాట్ టాపిక్ కానుందట. వారు ఎవరో కాదు రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్. రామ్ పోతినేని, అనుపమ ఘాడంగా ప్రేమించుకుంటున్నారనే పుకారు చాలా కాలంగా వినిపిస్తుంది. 2017లో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్-అనుపమ జంటగా నటించారు.

తర్వాత వెంటనే ఉన్నది ఒకటే జిందగీ అంటూ మరో మూవీలో జతకట్టారు. ఈ రెండు చిత్రాల సెట్స్ లోనే వీరి ప్రేమకు బీజం పడిందట. అది పెరిగి పెద్దదై పెళ్ళికి దారితీసిందట. రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి ప్రకటన ఎప్పుడైనా రావచ్చని టాలీవుడ్ వర్గాల వాదన. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ స్కంద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

దర్శకుడు బోయపాటి శ్రీను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. స్కంద పార్ట్ 2 కూడా ప్లాన్ చేసిన బోయపాటి కథను అసంపూర్తిగా తెరకెక్కించాడు. లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్లు యాక్షన్ ఎపిసోడ్స్, సన్నివేశాలు తెరకెక్కించాడు. స్కంద ట్రోల్స్ కి గురైంది. ప్రస్తుతం రామ్ పోతినేని ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ మీదే. దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు