Gold Prices: తులం వెండి రూ. 820.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 30న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,380 గా ఉంది. నవంబర్ 29న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350తో విక్రయించారు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Gold Prices: తులం వెండి  రూ. 820.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Follow us on

Gold Prices: బంగారం, వెండి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఒక్కరోజులో రూ.700 మేర పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ లో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ రేట్ 2046 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ రేట్ మాత్రం ఔన్స్ కు 25 డాలర్లు కొనసాగుతోంది.అయితే దేశీయంగా మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారు ఆందోళన చెందుతున్నారు.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 30న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,380 గా ఉంది. నవంబర్ 29న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం బంగారం ధరలు రూ.750 పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,530గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,380 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,040తో విక్రయిస్తున్నారు. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,100తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.79,500గా నమోదైంది. బుధవారం తో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ.700 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.79,200గా ఉంది. ముంబైలో రూ.79,200, చెన్నైలో రూ.82,200, బెంగుళూరులో 78,000, హైదరాబాద్ లో రూ.82,200తో విక్రయిస్తున్నారు.

Read Today's Latest Business News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు