Pushpa 2: పుష్ప 2 మూవీ లో ట్విస్ట్ తెలిస్తే మతి పోవాల్సిందే…

పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 అనే సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ తనదైన రీతిలో నటించి మెప్పిస్తాడంటూ చిత్ర యూనిట్ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Pushpa 2: పుష్ప 2 మూవీ లో ట్విస్ట్ తెలిస్తే మతి పోవాల్సిందే…

Follow us on

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే… ఈ సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులందరికీ అబ్బురపరిచాడు. ఇక పుష్ప క్యారెక్టర్ లో ఆయన నటించినందుకు గాను ఆయనకు రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 అనే సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ తనదైన రీతిలో నటించి మెప్పిస్తాడంటూ చిత్ర యూనిట్ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది…అయితే పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన ఒక టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులందరిలో అంచనాలను పెంచేసింది. ఇక దాంతోపాటుగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందంటూ ఈ సినిమా మీద చిత యూనిట్ కూడా భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక పుష్ప 2 నుంచి ఒక అసలైన ట్విస్ట్ అనేది ఇప్పుడు బయటకి వచ్చినట్టు గా తెలుస్తుంది.

అది ఏంటి అంటే పుష్ప కి నమ్మిన బంటుగా ఉన్న కేశవ బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర లొంగిపోయి పుష్పని చంపడానికి ప్లానేసి తన చేతులతో తనే పుష్ప ని చంపబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే కేశవ తను ప్రేమించిన అమ్మాయిని షేకవత్ చంపుతానని బెదిరించడంతో ఇలా చేయడానికి ఒప్పుకున్నట్లు గా కూడా తెలుస్తుంది. అయితే షేకవత్ తనని చంపడానికి వేసిన ప్లాన్ ని తెలుసుకున్న పుష్ప వాళ్ల ట్రాప్ లో నుంచి బయట పడి షేకవత్ ని ఎలా ఇరికించాడు అనేదే ఇక్కడ ట్విస్ట్…

ఇక ఇలా పుష్ప సినిమా నుంచి ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇక సుకుమార్ ఈ సినిమా మీద ఇంకా ఇలాంటి ట్విస్ట్ లు చాలానే డిజైన్ చేశాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి ట్విస్ట్ లు ఈ సినిమాలో పదుల సంఖ్యలో ఉన్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చాలంటే అదిరిపోయే ట్విస్ట్ పెడితేనే అద్భుతంగా ఆడుతుంది. అలాగే జనాలకి కూడా బాగా నచ్చుతుంది. కాబట్టి సుకుమార్ కూడా అదే ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కనక హిట్ అయితే సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరో, డైరెక్టర్లు గా కొనసాగే అవకాశం ఉంది…

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు