Pushpa 2: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు సినిమాలను చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తే సక్సెస్ లు వస్తాయని తెలిసిన కూడా కావాలనే ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళలో సుకుమార్ ఒకరు. ఈయన చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా తన సినిమాల్లో ప్రతి సీన్ లో కూడా ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక పాయింట్ ను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు.
ఇక అందువల్లే ఆయనను ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పిలుస్తూ ఉంటారు. తెలుగులో ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు ఎవరు లేరు. ముఖ్యంగా ఆయన వేసిన బాటలో ఇప్పుడిప్పుడు కొంతమంది దర్శకులు వస్తున్నప్పటికీ ఆయన రేంజ్ ను అందుకోవడంలో మాత్రం వాళ్ళు చాలావరకు వెనకబడిపోతున్నారు. ఇక ఇలాంటి సుకుమార్ ఇంతకుముందు చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. మరి ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద కొంచెం కోపంతో ఉన్న విషయం మనకు తెలిసిందే…
ఆయన మీద కోపం తగ్గిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ మళ్లీ ఈ సినిమాను రీ షూట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే కథని కూడా కొంత మారుస్తూ మరికొన్ని సీన్స్ ని కూడా యాడ్ చేసి సినిమాని చాలా బాగా వచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తెలుగులో పుష్ప సినిమాకి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది.
కానీ పుష్ప 2 సినిమాకి అలాంటి టాక్ రాకుండా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చే విధంగా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశ్యం తోనే సుకుమార్ ఈ సినిమాను చాలా ప్రస్తేజియస్ గా తీసుకొని మరి కొన్ని సీన్ లని రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అక్టోబర్, నవంబర్ 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More