Prabhas: ప్రభాస్ గడ్డం ఎందుకు పెంచుతారో తెలుసా? అద్దం ముందు నిల్చొని ఇలా చేస్తారా?

నాన్నకు ప్రేమతో సినిమాతో చాలా మంది అబ్బాయిలు గడ్డం, హెయిర్ స్టైల్ పై కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. స్టైల్ గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Written By: Suresh
  • Published On:
Prabhas: ప్రభాస్ గడ్డం ఎందుకు పెంచుతారో తెలుసా? అద్దం ముందు నిల్చొని ఇలా చేస్తారా?

Follow us on

Prabhas: హీరో ప్రభాస్ గురించి పరిచయం అక్కర్లేదు. కృష్ణంరాజు మనువడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బాహుబలి చిత్రంతో తన రేంజ్ అమాంత పెరిగిపోయిందనే చెప్పాలి. ఆమధ్య ఓరమాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. రెండు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ రేంజ్ తగ్గకపోవడం చూస్తే.. ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సౌత్ వారికి మాత్రమే పరిచయం ఉన్న ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రెబల్ స్టార్. అయితే ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా, మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నా ప్రభాస్ గడ్డంతోనే కనిపిస్తారు. అసలు ప్రతి సారి గడ్డంతో ఎందుకు కనిపిస్తారు అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

నాన్నకు ప్రేమతో సినిమాతో చాలా మంది అబ్బాయిలు గడ్డం, హెయిర్ స్టైల్ పై కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. స్టైల్ గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో హెయిర్ స్టైల్ కోసం ఎన్టీఆర్ ను ఫాలో అయితే.. గడ్డం స్టైల్ కోసం రామ్ చరణ్ ని ఫాలో అవుతుంటారు. సమంత-చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో చెర్రీ గడ్డం స్టై్ల్ అదరహో అనిపిస్తుంది. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ లుక్స్ కి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఫిదా అయిపోతుంటారు. ఇక ప్రభాస్ గడ్డంతో ఉన్న లుక్స్ చూసి కుర్రకారు కుల్లుకుంటారు. అబ్బాయిల్లో చాలా మంది గడ్డాన్ని స్టైల్ కోసం పెంచుతారు. కానీ ప్రభాస్ గడ్డం పెంచడం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉందట. 2010లో ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన తండ్రిని మిస్ అవుతున్న ప్రభాస్.. ఆయన గుర్తుకు వచ్చిన ప్రతి సారి అద్దం ముందుకు వెళ్లి తనని తాను చూసుకుంటారట. గడ్డంలో ఉన్న తనని చూసుకుంటే తన తండ్రిలా కనిపించిన ఫీల్ కలుగుతుందట. ఆ ఫీలింగ్ తన తండ్రి తనతోనే ఉన్నాడనే నమ్మకాన్ని కలిగిస్తుందట. అందుకే తాను గడ్డం పెంచడానికి ఇష్టపడుతాను అని అంటారు ప్రభాస్.

ప్రభాస్ కృష్ణం రాజు వారసుడిగా వచ్చాడని అందరూ భావిస్తారు. కానీ ప్రభాస్ తండ్రికి కూడా సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన తండ్రి పేరు సూర్య నారాయణ రాజు. మంచి డైనమిక్ నిర్మాత అనే పేరు కూడా సంపాదించారు. తన అన్న కృష్ణం రాజుకి అండగా ఉంటూ గోపీ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు నటించిన చిత్రాలను నిర్మించేవారు. ఇక ప్రభాస్ ను హీరోగతా పరిచయం చేయాలని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసారు. కానీ సాధ్యం కాలేదు. ప్రభాస్ కు ఆసక్తి లేకపోవడంతో మరింత వాయిదా పడుతూ వచ్చిందట. ఇలా తన తండ్రితో ఎంతో సంబంధం ముడివేసుకోవడంతో ప్రభాస్ గడ్డం తీయడానికి ఇష్టపడరట. నాన్న పోలికగా ఉండడంతో గడ్డంతో అద్దం ముందు చూసుకోవడం విశేషం అంటున్నారు అభిమానులు. అయితే కృష్ణం రాజుకి కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా ప్రభాస్ ను తీసుకొచ్చారు. ఈశ్వర్ సినిమా ద్వారా స్ర్కీన్ మీదకు వచ్చారు ప్రభాస్. చాలా తక్కువ సమయంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందడం విశేషం. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రభాస్ నటించడం గమనార్హం.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇప్పటికీ ఎన్నో సినిమాలు ఉన్నాయి. సలార్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంటే.. ప్రాజెక్ట్ కే కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.అయితే ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ – కే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా పోస్టర్ ని బట్టి చూస్తే.. ప్రాజెక్ట్ – కే సూపర్ హీరో కథనంతో మార్వెల్ మూవీస్ తరహాలో ఉండబోతుంది అని అర్థమవుతుంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారట.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు