కరోనా కాలంలో హైదరాబాద్ రియల్ దూకుడు

ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది. గడ్డు పరిస్థితుల్లోనూ.. మిగిలిన నగరాలను బీట్ చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ ప్రత్యేక బ్రాండ్ సంపాదించిందని ఓ నివేదిక తేల్చింది. పూర్తి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భాగ్యనగరి తన సత్తాను చాటుకుంది. తాజాగా విడుదల అయిన పాప్ టైగర్.. జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మిగిలిన రంగాలకు భిన్నంగా రియల్ రంగం కరోనాకాలంలో భారీగా దెబ్బతీసింది. పలు […]

  • Written By: Srinivas
  • Published On:
కరోనా కాలంలో హైదరాబాద్ రియల్ దూకుడు

Follow us on

Hyderabad Real estate
ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది. గడ్డు పరిస్థితుల్లోనూ.. మిగిలిన నగరాలను బీట్ చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ ప్రత్యేక బ్రాండ్ సంపాదించిందని ఓ నివేదిక తేల్చింది. పూర్తి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భాగ్యనగరి తన సత్తాను చాటుకుంది. తాజాగా విడుదల అయిన పాప్ టైగర్.. జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మిగిలిన రంగాలకు భిన్నంగా రియల్ రంగం కరోనాకాలంలో భారీగా దెబ్బతీసింది. పలు ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టులు పక్కకు వెళ్లిపోయాయి.

భూముల ధరలు కూడా చాలా వరకు తగ్గాయి. అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాద్ ఉందని చెప్పాలి. మిగిలిన ప్రముఖ నగరాల్లో ఇండ్ల అమ్మకాలు.. ఆఫీజు లీజు ధరలు తగ్గితే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ మాత్రం దూసుకెళ్లడం.. ఆసక్తికరమని చెప్పాలి.గత ఏడాది జనవరి.. మార్చితో పోల్చితే.. ఈ ఏడాది హౌసింగ్ సేల్ 38శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

హౌసింగ్ లో మాత్రమే కాదు.. ఆఫీసు స్పేస్ లీజుల్లోనూ.. హైదరాబాద్ మిగిలిన నగరాలతో పోల్చితే.. ముందంజలో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ తో పోల్చితే.. మిగిలిన నగరాలైన బెంగళూరు.. ముంబయి.. చెన్నై.. ఢిల్లీలో తగ్గిపోయాయి. భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆఫీసు మార్కెట్ పతనమైంది. కరోనా దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. మార్కెట్ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని.. పలువురు వ్యాపారులు అనుకుంటున్నారు.

గతేడాది జనవరి.. మార్చితో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలాన్ని పోల్చి చూస్తే.. హైదరాబాద్ లో వృద్ధిరేటు 38శాతంగా ఉంటే.. ఢిల్లీలో 14శాతం.. అహ్మదాబాద్ లో 4శాతానికి పరిమితం అయ్యింది. వీటితో పోల్చితే.. చెన్నై 23శాతం.. కోల్ కతా 23శాతం ఉంది. హైదరాబాద్ కన్నా మార్కెట్ విలువ ఎక్కవగా ఉందని చెప్పుకునే బెంగళూరులోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇదంతా చూస్తుంటే.. మిగిలిన నగరాలతో పోల్చితే.. హైదరాబాద్ ముందంజలో నిలిచిందని చెప్పక తప్పదు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు