HomeతెలంగాణEngineering Colleges: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల లెక్క తేలింది.. కన్వీనర్‌ కోటా.. యాజమాన్యం కోటా లెక్కలివీ

Engineering Colleges: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల లెక్క తేలింది.. కన్వీనర్‌ కోటా.. యాజమాన్యం కోటా లెక్కలివీ

Engineering Colleges: వర్సిటీ క్యాంపస్, ప్రభుత్వ కాలేజీలు 19 ఉండగా, వాటిలో 5,343 సీట్లు ఉన్నాయని, మరో రెండు యూనివర్సిటీల్లో 1,260 సీట్లు ఉన్నాయని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 630, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని 9 కలేజీల్లో 3,150 సీట్లు

Engineering Colleges: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల లెక్క తేలింది. దీంతో బీటెక్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి సోమవారం(జూలై 8) వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. ఈ కళాశాలల్లో 98,296 సీట్లు ఉన్నట్లు తెలిపింది. దీంతో కన్వీనర్‌ కోటాలో 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు.

173 కాలేజీలు 98 వేల సీట్లు
రాష్ట్రవ్యాప్తంగా 173 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి బీటెక మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. 152 ప్రైవటే కాలేజీల్లో 91,143 సీట్లు ఉండగా, వాటిలో కన్వీనర్‌ కోటాలో63,704 సీట్లు భర్తీ చేస్తారు. వర్సిటీ క్యాంపస్, ప్రభుత్వ కాలేజీలు 19 ఉండగా, వాటిలో 5,343 సీట్లు ఉన్నాయని, మరో రెండు యూనివర్సిటీల్లో 1,260 సీట్లు ఉన్నాయని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రెండు ప్రభుత్వ కాలేజీల్లో 630, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని 9 కలేజీల్లో 3,150 సీట్లు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మూడు కాలేజీల్లో 1,080 సీట్లు ఉన్నాయి.

45 బ్రాంచ్‌లలో సీట్లు..
ఇక బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 45 బ్రాంచ్‌లలో సీట్లు భర్తీ చేయనున్నారు. దీంతో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ)లో 21,599 సీట్లు ఉన్నాయి. సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌)లో 11,196. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ)లో 10,398, సీఎస్‌ఈ డేటా సైన్స్‌లో 6,516, ఆరిటషీషియన్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ టేటా సైన్స్‌లో 1,365, సీఎస్‌ఈ సైబర్‌ సెక్యూరిటీలో 1,418, ఈఈఈ లో 4,202, ఐటీలో 3,705, సివి ఇంజినీరింగ్‌లో 3,231, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 2,979 సీట్లు ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper