Venkatesh – Teja : బుద్ధి ఉంటే ఈ జన్మలో వెంకటేష్ తో సినిమా చెయ్యను అంటున్న స్టార్ డైరెక్టర్.. అంత కోపం ఎందుకు?

ఆ సినిమా పేరు ‘సావిత్రి’. వెంకటేష్ కి కథ నచ్చింది కానీ , కొన్ని మార్పులు చేర్పు చేసి తీసుకొని రమ్మన్నాడు. కానీ తేజ ఆ తర్వాత వెంకటేష్ వద్దకే పోలేదట. ఎందుకంటే వెంకటేష్ తదుపరి చిత్రం తనతో చేస్తానని చెప్పి, వేరే డైరెక్టర్ తో సినిమా కమిట్ అవ్వడం ఆయన మనసుని చాలా బాధించిందట.

  • Written By: Vicky
  • Published On:
Venkatesh – Teja : బుద్ధి ఉంటే ఈ జన్మలో వెంకటేష్ తో సినిమా చెయ్యను అంటున్న స్టార్ డైరెక్టర్.. అంత కోపం ఎందుకు?

Follow us on

Venkatesh – Teja : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరోల లిస్ట్ తీస్తే అందులో విక్టరీ వెంకటేష్ పేరు కచ్చితంగా  ఉంటుంది. మినిమం గ్యారంటీ అంటే ఎంత చెత్త పరిస్థితిలోనైనా కనీస స్థాయి వసూళ్లను రాబట్టడం. వెంకటేష్ కి ఆ ఇమేజి ఉంది. గత జెనెరేషన్ లో ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే ఆయనకీ మినిమం వసూళ్లు వస్తుంటాయి అని అందరూ అంటున్నారు.

ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు వస్తుంటాయి. అలాంటి హీరో తో సినిమా చెయ్యాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి ..?. కానీ ఒక దర్శకుడు మాత్రం వెంకటేష్ తో సినిమా తీసే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు తేజ. జయం , చిత్రం , నువ్వు నేను లాంటి సంచలన విజయాలను అందుకున్న తేజ గతం లో వెంకటేష్ తో ఒక సినిమా తియ్యాలి అనుకున్నాడు.

ఆ సినిమా పేరు ‘సావిత్రి’. వెంకటేష్ కి కథ నచ్చింది కానీ , కొన్ని మార్పులు చేర్పు చేసి తీసుకొని రమ్మన్నాడు. కానీ తేజ ఆ తర్వాత వెంకటేష్ వద్దకే పోలేదట. ఎందుకంటే వెంకటేష్ తదుపరి చిత్రం తనతో చేస్తానని చెప్పి, వేరే డైరెక్టర్ తో సినిమా కమిట్ అవ్వడం ఆయన మనసుని చాలా బాధించిందట.

అందుకే మళ్ళీ వెంకటేష్ ని కలవలేదు అని గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయనతో ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన లేదు కానీ, ఒకవేళ చెయ్యాల్సి వస్తే మాత్రం ‘సావిత్రి’ సబ్జెక్టు తోనే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ ఇదే సినిమా పేరు తో తేజ గోపీచంద్ తో చేద్దాం అనుకున్నాడు, కానీ గోపీచంద్ కూడా తేజతో ప్రస్తుతం సినిమా చేసే ఉద్దేశ్యం లో లేనట్టు తెలుస్తుంది.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు