Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood » Venkatesh is acting in three films in a row

Venkatesh: వెంకటేష్ సినిమాల జోరు పెంచుతున్నాడా..? వరుసగా ముగ్గురు డైరెక్టర్లను లైన్ లో పెట్టాడా..?

వెంకటేష్ గత కొన్ని రోజుల నుంచి సక్సెస్ లను అందుకోవడంలో కొంత వరకు తడబడుతున్నట్టుగా తెలుస్తుంది. 'ఎఫ్2 ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. కాబట్టి ఆ క్రెడిట్ ఇద్దరి హీరోలకి వెళుతుంది. ఇక ఎఫ్ 3 సినిమాతో మెప్పించినప్పటికీ అది అంతా హిట్ సినిమా అయితే కాదు. ఇక రీసెంట్ గా శైలేష్ కోలన్ దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమాతో ఒక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇప్పుడు 'అనిల్ రావిపూడి' డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.

Written By: Gopi Velpula , Updated On : July 13, 2024 / 02:40 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Venkatesh Is Acting In Three Films In A Row

Venkatesh

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Venkatesh: ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను చేయడంలో శోభన్ బాబు ఎలాంటి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడో ఆయన తర్వాత జనరేషన్ లో విక్టరీ వెంకటేష్ కూడా అలాంటి ఒక గొప్ప పేరునైతే తెచ్చుకున్నాడు. ఇక ఆయన ఫ్యామిలీ సబ్జెక్టులను ఎంచుకుంటూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయన లాంటి సినిమా హీరో మరొకరు లేరు అనేంత లా ఫ్యామిలీ సబ్జెక్టును డీల్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొట్టాడ్. ఇక వంటింటికి మాత్రమే పరిమితమైన ఫ్యామిలీ లేడీస్ ని సైతం థియేటర్లకి రప్పించిన ఏకైక హీరో కూడా వెంకటేశ్ కావడం విశేషం.

ఇక అలాంటి వెంకటేష్ గత కొన్ని రోజుల నుంచి సక్సెస్ లను అందుకోవడంలో కొంత వరకు తడబడుతున్నట్టుగా తెలుస్తుంది. ‘ఎఫ్2 ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. కాబట్టి ఆ క్రెడిట్ ఇద్దరి హీరోలకి వెళుతుంది. ఇక ఎఫ్ 3 సినిమాతో మెప్పించినప్పటికీ అది అంతా హిట్ సినిమా అయితే కాదు. ఇక రీసెంట్ గా శైలేష్ కోలన్ దర్శకత్వంలో చేసిన సైంధవ్ సినిమాతో ఒక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇప్పుడు ‘అనిల్ రావిపూడి’ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు ఇద్దరు స్టార్ డైరెక్టర్లను కూడా తను లైన్ లో పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో విరాటపర్వం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు ఉడుగుల దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక దానికి సంబంధించిన కథ చర్చలను ప్రస్తుతం వెంకటేష్ తో జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా మరొక యంగ్ డైరెక్టర్ తో కూడా వెంకటేష్ ఒక సినిమా కమిట్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక వెంకటేష్ స్పీడ్ చూస్తుంటే ఎలాగైనా సరే తను చాలా ఎక్కువ సినిమాలు చేసి మంచి విజయాలు అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే తను తొందరగా సినిమాలను ఒకే చేసి ఆ సినిమాలను వీలైనంత తొందరగా సెట్స్ మీదకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఒకవేళ వెంకటేష్ కనక ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నట్లైతే సీనియర్ హీరోలలో తను కూడా టాప్ హీరో రేంజ్ లోకి వెళ్తాడు.

ఇక ఇప్పటికే బాలయ్య బాబు, చిరంజీవి ఇద్దరు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే వాళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను కూడా చేస్తున్నారు. కానీ వెంకటేష్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తు తెలుగుకే పరిమితం అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు వెంకటేష్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మినిమం గ్యారంటీగా నిలిచేది. మరి అలాంటి వెంకటేష్ నుంచి ఎందుకు ఒక క్వాలిటీ సినిమా రాలేకపోతుంది అని తన అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సబ్జెక్టులను కనక చూస్తుంటే మళ్లీ వెంకటేష్ ఒకప్పటి ట్రాక్ ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఒకప్పుడు ఆయన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి ‘, ‘వసంతం ‘ లాంటి డీసెంట్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి డీసెంట్ సినిమాలతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడు… మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో మరోసారి వింటేజ్ వెంకటేష్ ను మనకు పరిచయం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Venkatesh is acting in three films in a row

Tags
  • Latest Tollywood News
  • Venkatesh
  • venkatesh movies
Follow OkTelugu on WhatsApp

Related News

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Venkatesh Trivikram New Movie: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారా..? అందులో గురూజీ ఫేవరెట్ హీరోయిన్ కూడా ఉందా..?

Venkatesh Trivikram New Movie: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారా..? అందులో గురూజీ ఫేవరెట్ హీరోయిన్ కూడా ఉందా..?

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Mahesh fighting with a lion?: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు సింహం తో ఫైట్ చేయబోతున్నాడా..?

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Rana Naidu Season 2 Review: రానా నాయుడు సీజన్ 2 ఫుల్ సిరీస్ రివ్యూ…

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.