YS Sharmila’s son : వైఎస్‌ షర్మిల కొడుకు పెళ్లి ఫిక్స్‌: అమ్మాయి ఎవరంటే..

ఇంతకీ రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది.

  • Written By: NARESH
  • Published On:
YS Sharmila’s son : వైఎస్‌ షర్మిల కొడుకు పెళ్లి ఫిక్స్‌: అమ్మాయి ఎవరంటే..

Follow us on

YS Sharmila’s son : వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కొడుకు రాజారెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని షర్మిల బహిరంగంగా చెప్పకపోయినా సోషల్‌ మీడియలో ఉదయం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. రాజారెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం ఆయన కొన్ని ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. ఆ మధ్య రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇండియా వచ్చాడు. వచ్చిరాగానే ఇడుపులపాయ వెళ్లాడు. సాధారణంగా రాజారెడ్డి ఫొటోలను బయటపెట్టేందుకు షర్మిల ఇష్టపడదు. ఆ మధ్య అతడి గ్రాడ్యుయేషన సందర్భంగా అమెరికా వెళ్లినప్పుడు ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. ఆరడగులు, చూపుతిప్పుకోనివ్వని రూపంతో గ్రీకువీరుడిలా ఉన్నాడు రాజారెడ్డి.

ఉదయం నుంచి రాజారెడ్డి పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అతుడు చేసుకోబోయో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని టాక్‌ నడుస్తోంది. షర్మిల తెలంగాణలో రాజకీయ ఆరంగేంట్రం నుంచి ఆమెకు వైసీపీ సోషల్‌ మీడియా దూరంగా ఉండుకుంటూ వస్తోంది. అయితే అందులోని వ్యక్తులే రాజారెడ్డి పెళ్లి గురించి బయటి ప్రపంచానికి చెప్పడం విశేషం. ఉదయం నుంచి వారు తమ తమ గ్రూపుల్లో ఈ ఫొటోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

ఇంతకీ రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అన్నటుఉ్ట ఈమె పేరున్న కుటుంబానికి చెందినదే. ఈమె తాత అట్లూరి ప్రసాద్‌ రెండు తెలుగు రాషా్ట్రల్లో పేరొందిన ఛట్నీస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుడు. రెండు కూడా ఉన్నత కుటుంబాలే కావడంతో రాజారెడ్డి, ప్రియ పెళ్లికి గ్రీన సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. కాగా, రాజారెడ్డి తండ్రి బ్రాహ్మణ, తల్లి రెడ్డి, విరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. షర్మిలను చేసుకున్న తర్వాత అనిల్‌ క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ప్రస్తుతం ఆయన మతబోధకుడిగా కొనసాగుతున్నారు. ప్రియ కుటుంబానిది కమ్మ సామాజిక వర్గం. అన్నట్టు తన మేనమామ జగన ప్రస్తుతం కమ్మ సామాజికవర్గం మీద కత్తులు, కటార్లు తీస్తున్న నేపథ్యంలో.. రాజారెడ్డి కమ్మ సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండటం విశేషం. అ మధ్య జగన పెద్ద కూతురును రాజారెడ్డికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదుగాని అది ప్రచారానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు జగన, షర్మిల మధ్య మాటలు లేవ్‌. మరి ఈ విషయం అతడికి తెలిసిందా? పెళ్లికి జగన హాజరవుతాడా? ఏమో వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు