JanaSena Vs YCP: జనసేనపై వైసీపీ కుట్ర.. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా

జనసేన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా ఉన్న పసుపులేటి పద్మావతి వైసీపీలో చేరారు. కుమారుడు సందీప్ రాయల్ తో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి.

  • Written By: Dharma
  • Published On:
JanaSena Vs YCP: జనసేనపై వైసీపీ కుట్ర..  తాడేపల్లి ప్యాలెస్  వేదికగా

Follow us on

JanaSena Vs YCP: ఎన్నికల సమీపిస్తున్న వేళ జనసేనపై వైసిపి మరో కుట్ర కోణాన్ని తెరతీసింది. ఇన్నాళ్లు జనసేనలో ఉన్న ప్రో వైసిపి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ను చదివి పవన్ పై విమర్శలు చేస్తున్నారు. వైసిపి కండువా కప్పుకొని జనసేన తో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ నిర్ణయాలను తప్పుపడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. జనసేన లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి.. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నీలాప నిందలు వేస్తున్నారు.

జనసేన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా ఉన్న పసుపులేటి పద్మావతి వైసీపీలో చేరారు. కుమారుడు సందీప్ రాయల్ తో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, మరో మహిళ నేత కోట రుక్మిణి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి తో పొత్తును తప్పుపట్టారు. అక్కడితో ఆగకుండా తల్లిదండ్రులు ఎవరు మీ పిల్లలను పవన్ కళ్యాణ్ వెంట పంపొద్దు అని హితవు పలకడం విశేషం. పవన్ చంద్రబాబు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని.. ఆయన నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడని కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీలో చేరిన సదరు మహిళ జనసేనలో కీలకంగా ఉన్న కోట రుక్మిణిని టార్గెట్ చేసుకోవడం విశేషం. రుక్మిణి కోసం మమ్మల్ని ఎందుకు గెంటేశారు? ఆమెఅంటే భయమా? లేకుంటే అభిమానమా? పార్టీని నమ్ముకుని పని చేస్తున్న 32 మందిని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రుక్మిణి కోసం గెంటేయడం న్యాయమేనా? అని పద్మావతి ప్రశ్నించారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొద్ది నెలల కిందట పవన్ స్పష్టంగా చెప్పారు. వైసిపి ఓటమికి కంకణం కట్టుకున్నామని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా ఉండాలంటే టిడిపి తో పొత్తు తప్పనిసరి అని.. పొత్తులకు విగాతం కలిగేలా ఎవరూ వ్యాఖ్యానాలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు నాదేండ్ల మనోహర్ పైనేతలు విమర్శలు చేస్తే.. ఇష్టముంటే పార్టీలో కొనసాగండి.. లేకుంటే వెళ్లిపోండి అంటూ లైట్ తీసుకున్నారు.

అయితే జనసేన లో ఉన్న ప్రోవైసిపీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ప్రతి ఒక్కరూ పవన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ తో పాటు ఐప్యాక్ ఆదేశాలను వారంతా పాటిస్తున్నారు. అయితే ఈ నేతల వ్యాఖ్యలను జనసేన హై కమాండ్ లైట్ తీసుకుంటుంది. పార్టీ నుంచి స్క్రాప్ అంత బయటకు పోతోందని భావిస్తోంది. వారు వెళ్ళిపోతే జనసేనకు వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతోంది. అటు పవన్ సైతం ఉన్న వారితో రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునేలా వ్యూహం రూపొందిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ జనసేనపై చేస్తున్న కుట్ర ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. దీనిపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధినేత పవన్ కు తాము అండగా ఉంటామని చెబుతున్నారు.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు