Salaar Trailer Highlights : సలార్ ట్రైలర్ లోని ప్రధాన హైలెట్స్, మైనస్ లు ఇవే…

ఇక ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి.ఇంతకుముందు రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో లుక్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి…

  • Written By: Gopi
  • Published On:
Salaar Trailer Highlights : సలార్ ట్రైలర్ లోని ప్రధాన హైలెట్స్, మైనస్ లు ఇవే…

Follow us on

Salaar Trailer Highlights : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సత్తా చాటుకున్న ప్రభాస్ తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో వరుసగా సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే సాదించలేదు. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తనదైన నటనతో మెప్పించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది ఇక ఈ సినిమా డిసెంబర్ 22 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమం లో ఈ రోజు రిలీజ్ అయిన ట్రెయిలర్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందుగా ఈ ట్రైలర్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే…

ఈ సినిమా భారీ స్థాయి లో ఉండబోతుంది అనేది ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే భారీ తారాగణంతో సినిమా ఏ రేంజ్ లో అయితే ఉండాలో ఆ రేంజ్ లో ఉంది దాని వల్లే ఈ సినిమాకు అయితే హైప్ అనేది క్రియేట్ అయింది…

ఇక ఈ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి.ఇంతకుముందు రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో లుక్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి…

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎమోషన్స్ కూడా అత్యద్భుతంగా ఉండబోతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య వచ్చే ఆ కోర్ ఎమోషన్ ఈ సినిమా మొత్తానికి ప్లస్ అవ్వబోటున్నట్టు గా తెలుస్తుంది…
ఎలివేషన్స్ అయితే కే జి ఎఫ్ లెవెల్ ల్లోనే మళ్లీ రిపీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఆ భారీ సెటప్ కూడా సినిమాకి ప్లస్ అవుతుంది అలాగే ఆర్టిస్టులు అయిన పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా ఈ సినిమాకి మరొక హైలెట్ గా కనిపిస్తుంది…

ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటంటే…

ఈ ట్రైలర్ ని అబ్జర్వ్ చేస్తే సీన్ కి సీన్ కి మధ్య ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్ గా కుదరనట్టుగా తెలుస్తుంది. అందుకే ప్రతి సీన్ కూడా గడబడగా కనిపిస్తుంది.ప్రభాస్ చెప్పిన డైలాగులలో పెద్దగా దమ్ము లేదు అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా నీరసంగా ఉంది. ఇక ఎక్కడైతే ట్రైలర్ ని ఓపెన్ చేశారో దానికి సంబంధించిన పర్ పస్ ని క్లారిటీ గా జస్టిఫికేషన్ ఇవ్వడం లో ఫెయిల్ నట్టు గా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో ఎంత సేపు ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చెప్పారు కానీ దానికి సంభందించిన ఒక్క ఎమోషన్ షాట్ కూడా ట్రైలర్ లో ప్రాపర్ గా కన్వే చేయలేకపోయారు…

వరల్డ్ బిల్డింగ్ అనేది ప్రాపర్ గా సెట్ అవునట్టుగా కనిపించట్లేదు. ట్రైలర్లో కన్సిస్టెన్సీ ఎక్కడా కనిపించలేదు ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తూ వచ్చిందే తప్ప ప్రాపర్ సీన్స్ పర్ఫెక్ట్ స్లాట్ లో వేసి జనాలకి ఎక్కించడం లో ఫెయిల్ అయ్యారు…

ప్రభాస్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ఒక సీను కూడా ట్రైలర్లో లేదు.ఇక ఒకటి రెండు ట్రై చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు