Vijay Devarakonda Craze: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమా ప్రేక్షకులను షేక్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ దేవరకొండ సినిమాలకు ఎప్పుడు రాని క్రేజ్, ఈ ‘లైగర్’ సినిమాకు రావడం విశేషం. మొత్తమ్మీద విజయ్ లైగర్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. మరోపక్క విజయ్ క్రేజ్ ను, విజయ్ సెన్సెషన్ ను చూసి తోటి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండకి ఇంత క్రేజ్ ఉంటే ఓకే. కానీ, వేరే భాషల్లో కూడా విజయ్ దేవరకొండ పై విపరీతమైన ప్రేమను చూపించడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాజాగా పాట్నాలో విజయ్ కోసం అక్కడ ప్రేక్షకులు ఎగబడిన తీరు చూసి బాలీవుడ్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
లైగర్ సినిమా ప్రమోన్లలో భాగంగానే పాట్నా వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అక్కడకి ఊహించని విధంగా విజయ్ కోసం భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. పైగా వారంతా విజయ్ దేవరకొండను చూసి ‘లైగర్, లైగర్’ అంటూ నినాదాలు చేశారు. భారీ ఫ్లెక్సీలు పట్టుకుని విజయ్ దేవరకొండ కోసం గంటల తరబడి నిలబడ్డారు. ఇది చూసి ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ కూడా షాక్ అయ్యాడు. తనకు పరాయి భాషలో లైగర్ మొదటి సినిమా. అయినా తన కోసం వేలమంది ఇంతలా పరితపించడం చూసి విజయ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.
అలాగే పాట్నాలోని AN కాలేజీకి కూడా విజయ్ దేవరకొండ వెళ్ళాడు. అక్కడ విద్యార్థులంతా విజయ్ దేవరకొండను చూసి ‘మై హీరో.. మై హీరో’ అంటూ కేకలు పెట్టారు. మొత్తానికి ఓ స్టార్ హీరోకి కూడా దక్కని ఆదరణ.. పాట్నాలో విజయ్ దేవరకొండ దక్కింది. ఈ క్రేజ్ చూసి సినిమా వాళ్ళు సైతం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ క్రేజ్ కి సంబంధించిన వీడీయోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్స్ ‘ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
పైగా లైగర్ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఎలాగూ విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన మూడేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అందుకు కారణం ఉంది. విజయ్ ఆల్ రెడీ ఈ సినిమాని చూశాడు. ఈ సినిమా విజయ్ కి చాలా బాగా నచ్చిందట. లైగర్ సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు.
అన్నిటికీ మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పైగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే హిందీలో కూడా లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read:Ram Charan- Shankar Movie: చరణ్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తిరిగి చెన్నై వెళ్లిపోయిన శంకర్
#VijayDeverakonda meets sea of fans at a Patna college as he promotes #Liger. Watch videohttps://t.co/C4RKgQA9U4
— India Today Showbiz (@Showbiz_IT) August 6, 2022
Arrived 🔥😍😍😍😍😍😍😍#LigerOnAug25th#VijayDeverakonda #AnanyaPanday #PuriJagannadh pic.twitter.com/SajG74JXaS
— Himanshu@sportslover (@Himansh08188276) August 6, 2022
#VijayDeverakonda meets sea of fans at a Patna college as he promotes #Liger. Watch videohttps://t.co/C4RKgQA9U4
— India Today Showbiz (@Showbiz_IT) August 6, 2022
The Vijay Deverakonda Arrived In Style 🥳🥳
Mass Crowd 🤙🏻🤙🏻@TheDeverakonda#LIGER #VijayDeverakonda pic.twitter.com/eBM1dJIspo— Anonymous (@__GirDhar) August 6, 2022